twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాక్‌కు వత్తాసు పలికే ఉగ్రవాది అమీర్ ఖాన్..యాక్టింగ్ మానుకో..లాల్ సింగ్ చద్దాపై ప్రముఖ క్రిటిక్ దారుణ రివ్యూ

    |

    హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్‌గా రూపొందిన లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై క్రిటిక్స్ దారుణంగా స్పందిస్తున్నారు. అమీర్ ఖాన్‌ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా టాక్‌ను మూటగట్టుకొన్నది. ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ దారుణమైన రివ్యూను ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రివ్యూలో కేఆర్కే ఏం చెప్పారంటే..

     పాకిస్థాన్ దేశం మంచిదని చెప్పడానికి

    పాకిస్థాన్ దేశం మంచిదని చెప్పడానికి

    ఫారెస్ట్ గంప్ సినిమాను లాల్ సింగ్ చద్దాగా రీమేక్‌ చేసిన బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ హాలీవుడ్ సినిమాను ఖూనీ చేశాడు. లాల్ సింగ్ సినిమాను చూయింగ్ గమ్‌ మాదిరిగా సాగదీసి.. సాగదీసి ప్రేక్షకులకు విసుగుపుట్టించాడు. పాకిస్థాన్ దేశం చాలా మంచిదని చెప్పడానికి అదనంగా 15 నిమిషాల నిడివిని పెంచారు అని కమల్ ఆర్ ఖాన్ ఘాటుగా స్పందించారు.

    బాలీవుడ్ ఖాన్స్‌ పాకిస్థాన్‌కు వకాల్తా

    బాలీవుడ్ ఖాన్స్‌ పాకిస్థాన్‌కు వకాల్తా


    బాలీవుడ్‌లో ఖాన్ హీరోలు పాకిస్థాన్ దేశానికి వకాల్తా పుచ్చుకొన్నారు. 83 చిత్రంలో కూడా ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే.. భారత సైనికులు మ్యాచ్ చూసేందుకు పాకిస్థాన్ యుద్ధం ఆపేసింది అని చూపించారు. పాక్ దేశం మంచిదనే భ్రమను కలిగించడానికి చేసిన ప్రయత్నం అని బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) అన్నారు.

     అమీర్ యాక్టింగ్ మానుకో.. అంటూ

    అమీర్ యాక్టింగ్ మానుకో.. అంటూ


    లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్ నటన చూస్తే అతడికి యాక్టింగ్ రాదనే విధంగా ఫెర్ఫార్మ్ చేశాడు. ధూమ్ 3, పీకే,గజనీ సినిమాల్లోని క్యారెక్టర్‌ను లాల్ సింగ్ చద్దాలో కూడా చూపించాడు. అదే నటనను చూపించడానికి లాల్ సింగ్ సినిమాను ఎందుకు తీశాడు.ఒకే తరహా నటించడం యాక్టింగ్ అంటారా? ఒకవేళ అదే యాక్టింగ్ అయితే నటనను స్వస్తి చెప్పు. యాక్టింగ్ రాకపోతే సినిమాలను వదిలేయ్ అని కేఆర్కే తన రివ్యూలో వెల్లడించారు.

    శారీరకంగా, మానసికంగా వేధింపులు

    శారీరకంగా, మానసికంగా వేధింపులు


    లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్ యాక్టింగ్ చూస్తే ప్రేక్షకుడు విపరీతంగా ఇరిటేట్ అవుతాడు. సహనం కోల్పోయి తెర మీదకు వెళ్లి లాగి చెంపపై కొడుదామనేంత కోపం వస్తుంది. ఈ సినిమా మూడు గంటల ఉగ్రవాదం. డబ్బులు తీసుకొని.. థియేటర్లో బంధించి ప్రేక్షకుడిని శారీరకంగా, మానసికంగా వేధించి.. హింసించి.. చడ్డా మాదిరిగా ప్రేక్షకుడిని పిచ్చోడిని చేసి బయటకు పంపించేలా సినిమా ఉంటుంది అని కేఆర్కే ఘాటుగా స్పందించాడు.

    అమీర్ ఖాన్ ఉగ్రవాది.. రక్షించుకోండి అంటూ

    అమీర్ ఖాన్ ఉగ్రవాది.. రక్షించుకోండి అంటూ


    అమీర్ ఖాన్ నటుడు కాదు.. ఓ ఉగ్రవాది.. అతడి నుంచి మీకు మీరు రక్షించుకోండి. ఈ సినిమా థియేటర్‌కు కిలో మీటర్ దూరంలో ఉండండి. మీరు ఈ సినిమా బారిన పడకుండా ఉండటమే కాకుండా మీ స్నేహితులు, బంధువులను, ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించండి. ఈ సినిమాకు నేను 1 రేటింగ్ ఇస్తాను అని కేఆర్కే తన రివ్యూలో ఘాటుగా స్పందించాడు.

    English summary
    Laal Singh Chaddha is movie which remake of Hollywood's Forest Gump. Here is Kamal R Khan aka KRK review on Aamir Khan's Laal Singh Chaddha
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X