»   » రూ. 30 కోట్ల ఖర్చుతో కంగనా రనౌత్ లగ్జరీ భవంతి!

రూ. 30 కోట్ల ఖర్చుతో కంగనా రనౌత్ లగ్జరీ భవంతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రూ. 30 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన భవంతిని కట్టించుకుంది. తన హోమ్ టౌన్ మనాలిలో ఆమె ఈ భవంతిని నిర్మించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

2014లో క్వీన్ మూవీ విజయం తర్వాత తన సొంత పట్టణమైన మనాలిలో ఆమె కొంత స్థలాన్ని కొనుగోలు చేసింది. స్థలం కొనుగోలు చేసిన తర్వాత తన అభిరుచికి తగిన విధంగా విలాసవంతమైన భవంతి నిర్మించుకుంది. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆక్కిటెక్చర్‌తో ఈ భవంతిని నిర్మించారట. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ భవన నిర్మాణం జరిగింది.

ఈ భవంతి నుండి చూస్తే హిమాలయ పర్వతాల అందమైన వ్యూ కనిపిస్తుందని, 8 బెడ్ రూములతో ఈ భవంతి నిర్మించినట్లు సమాచారం. ప్రతి రూముకు బాల్కనీ వచ్చేలా అద్దాల ద్వారా సూర్యరష్మి లోనికి వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట.

ఇలాంటి బిల్డింగ్ ఇప్పటి వరకు మనాలీలో లేదు. లోకల్‌గా ప్రజలు, టూరిస్టులు ఈ ఖరీదైన భవంతి చూసేందుకు తరలి వస్తున్నారు. ఈ కట్టడం ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి కంగనా రనౌత్ గృహ ప్రవేశ వేడుక జరిపింది.

English summary
Kangana Ranaut had bought a piece of land in her scenic hometown in Himachal Pradesh. The actress had reportedly consulted several architects to design a plush house there. Some reports also said that it took the Queen actress four years to build the swanky mansion.Located in an area with a beautiful view of the Himalayas, the house in the resort town reportedly costs a whopping Rs 30 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X