»   » శ్రీదేవితో కంగన అప్పుడు అలా ..బెడ్ పైనుంచి లేవలేకపోతోంది!

శ్రీదేవితో కంగన అప్పుడు అలా ..బెడ్ పైనుంచి లేవలేకపోతోంది!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణ వార్త అటు సినిలోకాన్ని, ఇటు అభిమానులని షాక్ కి గురిచేసింది. శ్రీదేవితో అనుభందం ఉన్న సెలెబ్రిటీలు అయితే దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మేనల్లుడి పెళ్లి అంటూ దుబాయ్ లో శుభకార్యానికి వెళ్లిన శ్రీదేవి అక్కడే తుదిశ్వాస విడవడంతో అభిమానులు జీర్ణించుకోలేకేపోయారు. దానికి తోడు శ్రీదేవి మృతి మిస్టరీగా మారి మీడియాలో అనేక రకాల కథనాలు ప్రసారం అయ్యాయి.

శ్రీదేవి వైరల్ వీడియో : ఇదే చివరి జ్ఞాపకం, ఫ్యాన్స్ ఉద్వేగం!

ఎట్టకేలకు దుబాయ్ అధికారులు శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు తీసుకుని వెళ్ళడానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ సాయంత్రానికి శ్రీదేవి పార్థివ దేహం ముంబై చేరుకోనుంది. ఇదిలా ఉండగా శ్రీదేవితో అనుబంధం ఉన్న నటులు ఆమె మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. నటి కంగనా రనౌత్ శ్రీదేవి మరణ వార్తతో అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

జీర్ణించుకోలేనిది ఈ శోకం

జీర్ణించుకోలేనిది ఈ శోకం

ప్రముఖులలంతా శ్రీదేవి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. శ్రీదేవి మరణించి మూడు రోజులు గడచినా ఆమె భౌతిక కాయం అంత్యక్రియలకు నోచుకోలేదు. ఈ పరిస్థితి అభిమానులని విస్మయానికి గురిచేస్తోంది. ఎట్టకేలకు శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియా తరలించేందుకు దుబాయ్ అధికారులు అనుమతినిచ్చారు.

షాక్ లో కంగనా రనౌత్

షాక్ లో కంగనా రనౌత్

శ్రీదేవి మరణ వార్తతో కంగన రనౌత్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్, శ్రీదేవి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

 శ్రీదేవి రోల్ మోడల్

శ్రీదేవి రోల్ మోడల్

తనకు శ్రీదేవి రోల్ మోడల్ అని కంగనా రనౌత్ పలు సందర్భాల్లో వెల్లడించింది. ఆమెనుంచి తాను వృత్తి పరంగా, వ్యక్తిగతంగా స్ఫూర్తి పొందానని కంగన వెల్లడించింది.

రెండు రోజులుగా తీవ్ర జ్వరం

రెండు రోజులుగా తీవ్ర జ్వరం

శ్రీదేవి మరణ వార్త విన్నపటినుంచి కంగనా ఆరోగ్యం సరిగా లేదట. ఆమె గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది.

సరస్వతి పూజలో ఉత్సాహంగా

సరస్వతి పూజలో ఉత్సాహంగా

జనవరిలో అనురాగ్ బసు నిర్వహించిన సరస్వతి కార్యక్రమంలో కంగనా రనౌత్ తో కలసి శ్రీదేవి ఉత్సహంగా పాల్గొంది. అంతలోనే శ్రీదేవి మృతి చెందడంతో కంగనా రనౌత్ షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

షూటింగ్ వాయిదా

షూటింగ్ వాయిదా

కంగనా రనౌత్ ప్రస్తుతం మణికర్ణిక చిత్రంలో క్రిష్ దర్శకత్వంలో నటిస్తోంది. శ్రీదేవి మరణించడం, కంగన రనౌత్ అనారోగ్యానికి గురికావడంతో షూటింగ్ ని కొన్ని రోజులపాటు వాయిదా వేశారు.

English summary
Kangana Ranaut suffering from fever after hearing Sridevi death news. Sridevi is Kangana Ranaut rolemodel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu