Kareena Kapoor కు, మరో స్టార్ హీరోయిన్‌కు కరోనా వైరస్.. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. బీఎంసీ యాక్షన్
బాలీవుడ్‌ను మరోసారి కరోనావైరస్ భయాందోళనలకు గురిచేస్తున్నది. గత రెండేళ్లుగా మహారాష్ట్రను కుదిపేసిన ఈ ప్రాణాంతక వ్యాధి తగ్గుముఖం పట్టిందని అందరూ ఊపిరి పీల్చుకొంటున్న నేపథ్యంలోనే మరోసారి కోవిడ్ విజృంభిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు కరోనావైరస్ బారిన పడటం షాక్ గురిచేస్తున్నది. ఆ ఇద్దరు హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉందంటే..

కరీనా, అమృతకు కరోనావైరస్ పాజిటివ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్‌ను కరోనావైరస్ వెంటాడింది. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన కరీనాకపూర్ వైద్య పరీక్షలు నిర్వహించుకోగా ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కేవలం కరీనాకే కాకుండా మరో బాలీవుడ్ తార అమృతా అరోరాకు కూడా పాజిటివ్ అని రావడంతో బాలీవుడ్ వర్గాలు ఆందోళనకు గురి అవుతున్నారు.

విందులు, విలాసాలతో కరీనా జోష్
అయితే కొద్ది రోజులుగా ముంబైలో జరిగిన పలు విందుల్లో కరీనా కపూర్, అమృతా అరోరా మునిగి తేలారు. ఈ సందర్భంగా చాలా మంది స్నేహితులు, సన్నిహితులను కలిసి విందులో మజా చేశారు. అయితే ముంబైలో కోవిడ్ ప్రోటోకాల్స్, నిబంధనలు పాటించకుండా చాలా మందిని కలిశారు. కరీనా, అమృతా అరోరా ఎవరెవర్ని కలిశారు అనే వివరాలను ఇప్పుడు అధికారులు సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం.

బీఎంసీ రంగంలోకి
కరీనా కపూర్, అమృతా అరోరా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చాలా పార్టీలో పాలు పంచుకొన్నారు. అయితే ఈ ఇద్దరికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అధికారులు రంగంలొకి దిగారు. కరీనా, అమృతాను కలిసిన వారు వెంటనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాకుండా కరీనా, అమృతాపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నట్టు కూడా తెలిసింది.

కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన అంటూ బీఎంసీ
కరీనా, అమృతకు కరోనా పాజిటివ్ అని తెలియగానే.. బీఎంసీ అధికారులు ట్వీట్ చేసి స్పందించారు. యాక్టర్లు కరీనా కపూర్, అమృతా అరోరాకు కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారు కోవిడ్ నిబంధనలు పాటించకుండా చాలా పార్టీలో ఎంజాయ్ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించారు. వారితో కలిసి తిరిగిన వారు ఎంటేనే ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాం అని అధికారులు చెప్పారు.

సినీ ప్రముఖులను వెంటాడుతున్న కోవిడ్
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలువురు సినీ తారలు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయన క్వారంటైన్‌లో వెళ్లారు. ఆ తర్వాత నెగిటివ్ రిపోర్ట్స్ రావడంతో ఆయన తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు. మూడో వేవ్ అనే విధంగా కేసులు బయటకు రావడంతో మరోసారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

కరీనా కపూర్ ఖాన్ సినీ కెరీర్
కరీనా కపూర్ ఖాన్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు అంటే 2019లో గుడ్ న్యూస్ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన, అలాగే 2020 అంగ్రేజీ మీడియం చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో రెఫ్యూజీ చిత్రంతో అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60కిపైగా చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











