Don't Miss!
- News
jump: పైన ఇంటిలో అంకుల్, కిందింటి ఆంటీ ఎస్కేప్, ఒకే బిల్డింగ్ లో జంబలకడి జారు మిఠాయి, కసితీరా !
- Finance
Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్లో Aura ఫేస్లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Shehazada Trailer: అల.. వైకుంఠపురములో హిందీ రీమేక్.. ట్రైలర్ లోనే బన్నీని దించేశారుగా..
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల.. వైకుంఠపురంలో.. సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా సాధించిన విజయంతో అల్లు అర్జున్ మార్కెట్ ఒక్కసారిగా 200 కోట్లు పెరిగిపోయింది. ఆ తర్వాత పుష్ప సినిమా క్రేజ్ కు అది బాగానే ఉపయోగపడింది. అయితే అలాంటి సినిమాకు ఇప్పుడు హిందీలో రీమేక్ చేసి భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ మొదటిసారి పూర్తిస్థాయిలో కమర్షియల్ హీరోగా అల..వైకుంటపురంలో రీమేక్ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షెహజాద అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గా విడుదల చేశారు. అయితే ట్రైలర్ లో మాత్రం ఈ హీరో దాదాపు అల్లు అర్జున్ క్యారెక్టర్ ను కాపీ చేసినట్లుగానే అనిపిస్తోంది. లుక్కు నుంచి డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ వరకు అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో కూడా ఈ యువ హీరో అల్లు అర్జున్ ఫార్ములాను ఫాలో అయినట్లుగా అనిపిస్తుంది.

ఇక చాలా వరకు యాక్షన్స్ సీన్స్ కూడా ఒరిజినల్ సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనోన్ నటించింది. మొత్తానికి కార్తీక్ ఆర్యన్, కృతి సనోన్ మధ్యలో మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయినట్లు అనిపిస్తోంది. ఈ సినిమా కథ ప్రకారం అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది అని హిందీలో భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు. అయితే ఎక్కువ స్థాయిలో మాత్రం అల.. వైకుంఠపురములో సినిమాకు మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ అయ్యింది.
ఇక ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందించాడు. ఇంతవరకు అయితే వచ్చిన పాటలు కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. ఇక ఈ సినిమాకు రోహిత్ దావన్ దర్శకత్వం వహించగా హీరో కార్తీక్ కూడా ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. అల్లు ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని, అలాగే టి సిరీస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యలుగా పాల్గొన్నారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న ఈ కథ ఇప్పుడు ఈ హీరోకి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.