»   » శ్రీదేవిని తల్చుకుని బోరున ఏడ్చేసిన కూతుళ్లు!

శ్రీదేవిని తల్చుకుని బోరున ఏడ్చేసిన కూతుళ్లు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  శ్రీదేవిని తల్చుకుని బోరున ఏడ్చేసిన కూతుళ్లు!

  అలనాటి అందాల తార శ్రీదేవి, బోని కపూర్‌ల కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న 'ధడక్‌' సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ సోమవారం ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ తనను తాను నియంత్రించుకోలేక, తల్లిని తలుచుకుని కన్నీటి పర్యంతమయింది. భావోద్వేగానికి గురైన చెల్లిని జాహ్నవి కపూర్‌ దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ట్రైలర్ లాంచ్ వేడుకలో ఈ సంఘటన చూసిన వారి కళ్లు చెమ‍్మగిల్లాయి.

  కపూర్ ఫ్యామిలీ మొత్తం హాజరు

  జాహ్నవి నటిస్తున్న తొలి సినిమా ట్రైలర్ లాంచ్ కావడంతో బోనీ కపూర్, అనిల్ కపూర్‌తో పాటు కపూర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అయితే అన్నయ్య అర్జున్ కపూర్ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు.

   సారి చెబుతూ చెల్లికి సందేశం పంపిన అర్జున్ కపూర్

  సారి చెబుతూ చెల్లికి సందేశం పంపిన అర్జున్ కపూర్

  ‘ఈరోజు నువ్వు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతావు. ఎందుకంటే ఈరోజు నువ్వు నటించిన తొలి చిత్రం ‘దఢక్‌' సినిమా ట్రైలర్‌ విడుదల. నేను ముంబయిలో లేనందున నీ పక్కన ఉండలేకపోతున్నందుకు నన్ను క్షమించు. నిజాయితీగా ఉంటూ కష్టపడితే సినిమా రంగం అద్భుతంగా ఉంటుంది''..... అని ఈ సందర్భంగా జాహ్నవికి అర్జున్ కపూర్ సూచించారు.

  శ్రీదేవి మరణం తర్వాత ఒక్కటైన ఫ్యామిలీ

  శ్రీదేవి మరణం తర్వాత ఒక్కటైన ఫ్యామిలీ

  శ్రీదేవి జీవించి ఉన్న సమయంలో..... బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ వీరికి అంటీ ముట్టనట్లుగానే ఉండేవారు. అయితే శ్రీదేవి మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన స్టెప్ సిస్టర్స్ జాహ్నవి, ఖుషిలను అర్జున్ కపూర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రతి విషయంలోనూ అండగా ఉంటున్నారు. జాహ్నవి మీద మీడియాలో ఇటీవల చెత్త వార్తలు రావడంతో అర్జున్ కపూర్ తీవ్రంగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

  జులై 20 రిలీజ్

  జులై 20 రిలీజ్

  జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన ‘ధడక్' చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బేనర్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరాఠీ హిట్ మూవీ ‘సైరాట్' చిత్రానికి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.

  English summary
  Khushi Kapoor breaks down and hugs her sister Janhvi Kapoor at Dhadak trailer launch event. It's a big day for Janhvi Kapoor and her entire family as Sridevi and Boney Kapoor's daughter begins her Bollywood innings. From Anil Kapoor to daddy Boney Kapoor and sister Khushi Kapoor were present at the Dhadak trailer launch, while Arjun Kapoor gave a special shout-out to her and apologized for his absence on social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more