Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మీటూ ఆరోపణలతో ఇద్దరు ఔట్, సినిమా ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్త పడ్డాం: క్రితి సానన్
బాలీవుడ్ మూవీ 'హౌస్‌ఫుల్ 4' చిత్రీకరణ జరుగుతున్న సమయంలో దర్శకుడు సాజిద్ ఖాన్, నటుడు నానా పాటేకర్‌పై మీటూ ఆరోపణలు రావడంతో వారిని ప్రాజెక్ట్ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. సాజిద్ ఖాన్ స్థానంలో పర్హాద్ సంజి, నానా పాటేకర్ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకున్నారు.
ఈ చిత్రంలో నటిస్తున్న క్రితి సానన్.. మీటూ ఇష్యూపై, 'హౌస్‌ఫుల్ 4' షూటింగుపై ఆ ఎఫెక్ట్ ఏ మేరకు పడిందనే అంశంపై స్పందించారు. ఆ ఆరోపణలు రాగానే చిత్ర యూనిట్ ఆందోళనకు గురైంది, ఆ ఎఫెక్ట్ సినిమాపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు.

ఆ సంఘటనతో షాకయ్యాం
సినిమా షూటింగ్ జరుగుతుండగా ఉన్నట్టుండి డైరెక్టర్ తప్పుకోవడం, ఆయన స్థానంలో కొత్త వ్యక్తి వచ్చి డైరెక్ట్ చేయడం షాకయ్యే విషయమే. అయితే నిర్మాత సాజిద్ నడియావాలా ఆ పరిస్థితిని బాగా హ్యాండిల్ చేశారు. మేము కూడా మా వంతు సహకారం అందించామని క్రితి తెలిపారు.

ముందుగానే పూర్తి చేశాం
దర్శకుడి మార్పు జరిగినా... షూటింగ్ షెడ్యూల్ అనుకున్నదానికంటే ఒక రోజు ముందుగానే కంప్లీట్ చేశాం. మీటూ ఎఫెక్ట్ సినిమాపై పడకుండా జాగ్రత్తపడ్డాం. అక్షయ్ కుమార్, క్రితి కర్బంద, బాబీ డియోల్, రితేష్ దేశ్ ముఖ్, పూజా హెగ్డే అందరూ ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించామని తెలిపారు.

కొత్త డైరెక్టర్ బాగా హ్యాండల్ చేశాడు
మీటూ ఇన్సిడెంట్ జరిగి సాజిద్ ఖాన్ తప్పుకున్న తర్వాత... కొత్త దర్శకుడు వచ్చాక ప్రాజెక్టును బాగా హ్యాండిల్ చేశాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ లాంటి మేజర్ షెడ్యూల్స్ షూట్ చేశాం. సినిమా మేము అనుకున్న విధంగా అద్భుతంగా వచ్చిందని క్రితి సానన్ వివరించారు.

హౌస్‌ఫుల్ 4
బాలీవుడ్లో ‘హౌస్‌ఫుల్' సిరీస్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. మొదట వచ్చిన 3 చిత్రాలు భారీ విజయం అందుకోవడంతో తాజాగా ‘హౌస్‌ఫుల్ 4' తెరకెక్కుతోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.