»   » చావుకు దగ్గరలో ఉన్నా, రెండు తీరని కోరికలు, తిట్టేవాళ్లు తిట్టండి: కేఆర్‌కే

చావుకు దగ్గరలో ఉన్నా, రెండు తీరని కోరికలు, తిట్టేవాళ్లు తిట్టండి: కేఆర్‌కే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమాల్ రషీద్ ఖాన్.... ఈ పేరు గుర్తుందా? అప్పట్లో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం హిందీలో విడుదైనపుడు పవర్ స్టార్ మీద నానా దుర్భాషలాడుతూ వార్తల్లోకి ఎక్కాడు. ఇతర టాలీవుడ్ హీరోలపై కూడా నోరు పారేసుకుని తెలుగు సినీ అభిమానులంతా అసహ్యించుకునేలా ప్రవర్తించాడు. ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండే ఈ వివాదాస్పద క్రిటిక్, నిర్మాత, యాక్టర్ తన తాజా ట్విట్టర్ పోస్టుతో అందరూ షాకయ్యేలా చేశాడు. తనకు స్టమక్ క్యాన్సర్ సోకిందని, ఒకటి రెండేళ్ల కంటే ఎక్కువ బ్రతకను అని వెల్లడించారు.

 క్యాన్సర్ చివరి దశలో ఉంది

క్యాన్సర్ చివరి దశలో ఉంది

తనకు ఉదర సంబంధమైన క్యాన్సర్ వ్యాధి సోకిందని, ప్రస్తుతం అది చివరి దశలో ఉందని, చికిత్స చేసినా ఫలితం ఉండదని, మరో ఒకటి రెండేళ్లలో తాను చనిపోతాను అని కమాల్ ఆర్ ఖాన్ వెల్లడించారు.

 ఎవరి సానుభూతి మీద బ్రతకాలనుకోడం లేదు

ఎవరి సానుభూతి మీద బ్రతకాలనుకోడం లేదు

ఇపుడు ఎవరినీ ఎంటర్టెన్ చేయదలుచుకోలేదు. నాకు ఫోన్ చేసి నేను చనిపోతాను అనే విషయాన్ని గుర్తు చేసే వారికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరి సానుభూతి మీద తాను బ్రతకాలనుకోవడం లేదు.... అని కేఆర్‌కే ట్వీట్ చేశారు.

నన్ను తిట్టే వారిని, అసహ్యించుకునే వారిని అభినందిస్తా

నన్ను తిట్టే వారిని, అసహ్యించుకునే వారిని అభినందిస్తా

తనను చనిపోయే వ్యక్తిగా చూడకుండా.... గతంలో మాదిరి మామూలు వ్యక్తిగా ట్రీట్ చేస్తూ నన్ను తిట్టే వారిని, హేట్ చేసే వారిని, ప్రేమించే వారిని నేను అభినందిస్తాను.... అని కేఆర్‌కే పేర్కొన్నారు.

 రెండు కోరికలు తీరలేదనే బాధ

రెండు కోరికలు తీరలేదనే బాధ

చనిపోతున్నందుకు బాధగా లేదు, అయితే నా రెండు కోరికలు తీరనందుకు బాధగా ఉంది. అందులో ఒకటి ‘నిర్మాతగా తాను ఎ గ్రేడ్ సినిమా' చేయక పోవడం, రెండోది ‘అమితాబ్ జీతో సినిమా చేయక పోవడం'. ఈ రెండు తీరని కోరికలు నాతోనే చనిపోతాయి... అని కేఆర్‌కే పేర్కొన్నారు.

సమయం మొత్తం ఫ్యామిలీకే

సమయం మొత్తం ఫ్యామిలీకే

ఇకపై తన సమయం మొత్తం నా ప్రియమైన కుటుంబానికే కేటాయిస్తాను. మీరు నన్ను హేట్ చేసే రైనా, లవ్ చేసే వారైనా...... లవ్ యూ ఆల్ అంటూ అని కేఆర్‌కే పేర్కొన్నారు.

English summary
Actor-turned-director Kamaal Rashid Khan, popularly known as KRK, has been diagnosed with stage III stomach cancer, a press release shared by a verified Twitter handle by the name of KRKBOXOFFICE claims. Known for his controversial statements, KRK often locked horns with several Bollywood celebrities on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X