twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oscar awards కమిటీపై భగ్గుమన్న లతా మంగేష్కర్, దిలీప్ కుమార్ ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే?

    |

    ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2022 ప్రధాన కార్యక్రమం వివాదాస్పద అంశాల మధ్య ఘనంగా ముగిసింది. లాస్ ఎంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన పలు వివాదాస్పద అంశాలు చోటుచేసుకొన్నాయి. విల్ స్మిత్, క్రిస్ రాక్ చెంప వివాదం పక్కన పెడితే.. భారతీయ సినిమా పరిశ్రమకు సంబంధించిన లెజెండ్స్‌ను ఈ అవార్డుల కార్యక్రమంలో విస్మరించి అవమానించారనే విషయంపై భారతీయ సినిమా అభిమానులు భగ్గుమంటున్నారు. ఈ వివాదంలోకి వెళితే..

    Recommended Video

    Why Indian Fans Furious On Oscar 2022 దిగ్గజాలకి అవమానం ! | Filmibeat Telugu

    94వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ఇటీవల మరణించిన సినీ దిగ్గజాలకు నివాళి అర్పించే కార్యక్రమాన్ని ఆస్కార్ అవార్డుల కమిటీ చేపట్టింది. ఇటీవల మరణించిన సిడ్నీ పైటియర్, బెట్టీ వైట్, విలియమ్ హర్ట్, క్లారెన్స్ విలియమ్స్ 3, జీన్ పాల్ బెల్మాండో, డీన్ స్టాక్‌వెల్, మ్యాక్స్ జూలియన్ తదితరులకు నివాళులు అర్పించారు. అయితే ఈ జాబితాలో ఇండియన్ మూవీ లెజెండ్స్ లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌ను విస్మరించడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

     Lata Mangeshkar and Dilip Kumar fans fire on Oscar awards 2022 committee, Reason is here..

    2021లో నిర్వహించిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు శ్రద్దాంజలి ఘటించి వారికి గొప్ప నివాళి అర్పించారు. అయితే ఈ ఏడాది లతా, దిలీప్ కుమార్‌ను పట్టించుకోకపోవడంపై లతా, దిలీప్ అభిమానులు బహిరంగంగానే సోషల్ మీడియాలో ఎండగట్టారు.

    గతవారం బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డులు (బాఫ్టా) అవార్డుల కార్యక్రమంలో లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌కు ఆ కమిటీ ఘన నివాళి అర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

    లతా మంగేష్కర్ కెరీర్ విషయానికి వస్తే.. తన కెరీర్ విషయానికి వస్తే.. 25వేల పాటలను 36 భాషల్లో పాడారు. ప్రపంచ మ్యూజిక్ రంగానికి ఎనలేని సేవ చేయడం తెలిసిందే. భారత రత్న, పద్మ విభూషన్, పద్మ భూషన్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను గెలుచుకొన్నారు.

    దిలీప్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. 98 ఏళ్ల వయసులో మరణించాడు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో మొగల్ ఆజమ్, దేవదాస్, రామ్ ఔర్ శ్యామ్, క్రాంతి, కర్మ, సౌదాగర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు.

    English summary
    Lata Mangeshkar and Dilip Kumar fans fire on Oscar awards 2022 committee. Lata Mangeshkar, Dileep Kumar were ignored In momoriam in Oscars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X