twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహాభారతం ‘భీముడు’ కన్నుమూత.. తీవ్ర విషాదంలో సినీ పరిశ్రమ, భారత సైన్యం

    |

    ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ బీఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ టెలి సీరియల్‌లో భీముడు పాత్రను పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సొబ్తి ఇక లేరు. గుండెపోటు కారణంగా ఆయన సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన మరణ వార్తతో దిగ్బ్రాంతికి గురైన సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    ప్రవీణ్ కుమార్ సొబ్తి కుమార్తె నికునికా వెల్లడించిన ప్రకారం.. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మరణించారు. రాత్రి గుండెపోటు తీవ్రంగా రావడంతో ఢిల్లీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు అని ఓ ప్రకటనలో తెలిపారు.

     Mahabharats fame Bheem Praveen Kumar Sobti passes away in Delhi

    ప్రవీన్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. మహాభారతంలోని భీముడి పాత్రను అద్భుతంగా పోషించిన ఆయన ప్రతీ గడపకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన షహెన్‌షా, ధర్మేంద్ర నటించిన లోహా చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ా తర్వాత ఆజ్ కా అర్జున్, అజూబా, ఘాయల్ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.

    నటుడిగా కాకముందు ప్రవీణ్ కుమార్ భారతీయ క్రీడారంగానికి ఎనలేని సేవ చేశారు. అథ్లెటిక్ విభాగంలో హ్యామర్ త్రో, డిస్కస్ త్రో అద్భుతంగా రాణించారు. నాలుగుసార్లు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించారు. 1968లో మెక్సికోలో, 1972లో మ్యూనిచ్‌లో జరిగిన ఒలంపిక్ క్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. ఆసియా క్రీడాల్లో 2 బంగారు పతకాలు, ఒక వెండి, ఒక కాంస్య పతకాన్ని భారత్‌కు అందించారు. క్రీడా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను.. అర్జున అవార్డు లభించింది.

    బీఎస్ఎఫ్‌లో డిప్యూటీ కమాండెంట్‌గా సేవలందించారు. ప్రవీణ్ మరణంపై బీఎస్ఎఫ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా శ్రద్దాంజలి ఘటించారు. భీముడి పాత్ర ద్వారా అద్బుతమైన నటనా ప్రతిభను చాటుకొన్నారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    సైన్యం, సినిమా రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగంలోకి ప్రవేశించార. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

    English summary
    Mahabharat serial fame Bheem Praveen Kumar Sobti passes away in Delhi at age of 75. BSF tweeted that, Director General & All Ranks of BSF condole the untimely demise of Sh Praveen Kumar Sobti, former Deputy Commandant, Arjuna Awardee, two-time Olympian (1968 Mexico Games and 1972 Munich Games) & four-time Asian Games medallist (2 gold, 1 silver and 1 bronze)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X