Don't Miss!
- Finance
Lottery: జాక్ పాట్ అంటే ఇదేనేమో.. రూ. 10,555 కోట్ల విలువైన లాటరీ తగిలింది.. ట్విస్ట్ ఏంటంటే..
- Sports
Commonwealth Games: చరిత్ర సృష్టించిన ఎల్దోస్ పాల్.. ట్రిపుల్ జంప్‌లో డబుల్ ట్రీట్.. గోల్డ్, సిల్వర్ మనకే
- News
ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌పై దాడులు.. 400కు పైగా రాకెట్లు
- Technology
OnePlus ఆక్సిజన్ OS 12 కొత్త అప్డేట్ విడుదల!! Nord CE 2 5G లో మెరుగైన ఫీచర్స్ ఎన్నో...
- Lifestyle
Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు ఆగష్టు 07 నుండి ఆగష్ట్ 13 తేదీ వరకు..
- Automobiles
భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల
- Travel
ట్రెక్కింగ్ ప్రియులకు కొత్తగా పరిచయమైన హిల్‌స్టేషన్.. వంజంగి
48 ఏళ్ళ వయసొచ్చినా డ్రెస్ వేసుకోవడం రాదా.. బోల్డ్ బ్యూటీపై దారుణంగా ట్రోల్స్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినీ తారలు అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్ లు ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొందరు ఏ స్టైల్ కనిపించినా కూడా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆ తరహాలో నెగిటివ్ కామెంట్ ఎక్కువగా అందుకుంటున్న వారిలో మలైకా అరోరా కూడా చేరింది. రీసెంట్ గా ఆమె వేసుకున్న ఒక డ్రెస్ చాలా చండాలంగా ఉంది అంటూ డిజైన్ పై దారుణమైన కామెంట్ చేశారు. అసలు మలైకా అరోరా ఎక్కడికివెళ్ళింది? అలా ఎందుకు డ్రెస్ వేసుకుంది.. వివరాల్లోకి వెళితే..

గ్లామర్ డోస్
మలైకా అరోరా అంటే సోషల్ మీడియాలో తెలియని నెటిజన్స్ ఉండరు. ఎన్నో ఐటమ్స్ సాంగ్స్ తో క్రేజ్ అందుకుంది. తెలుగులో కూడా గబ్బర్ సింగ్ కెవ్వు కేక సాంగ్ తో మెప్పించింది. ఇక ఆమె ఇలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా ఒకే తరహా గ్లామర్ తో ఉండడానికి ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. మలైకా గతంలో మాదిరిగా సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ కూడా ఆమె గ్లామర్ తో మాత్రం నిత్యం జనాలను ఆకట్టుకుంటూనే ఉంది.

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో..
సినిమా ప్రపంచంలో కూడా ఆమె రెగ్యులర్ గా పార్టీలలో కూడా పాల్గొంటుంది. ఆమెకు ప్రముఖ సెలబ్రిటీలతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి రీసెంట్ గా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 50వ రోజు సందర్భంగా మలైకా అరోరా కూడా పార్టీకి హాజరైంది. అయితే అక్కడ ఒక్కొక్కరు ఒక్కో తరహా డ్రెస్సింగ్ స్టైల్ తో హైలెట్ అవ్వగా అందరిలోనూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే విధంగా ఉండాలని మలైకా కూడా ప్రయత్నించినట్లు అర్థమైంది.

దారుణంగా ట్రోలింగ్
మలైకా అరోరా చిన్న నిక్కర్ లోనే బ్లేజర్ వేసుకొని ఎద అందాలను హైలెట్ చేసింది. అలాగే విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఓ వర్గం వారిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె క్లీవేజ్ అందాలతో అయితే అందరికీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. అయితే ఈ ఫోటోలో గ్లామర్ పరంగా ఎంత వరకు క్లిక్ అయ్యాయి అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం కొందరు మాత్రం మలైకా గ్లామర్ ట్రీట్ పై దారుణమైన ట్రోలింగ్ కు దిగుతున్నారు.

డ్రెస్ ఎలా వేసుకోవాలో తెలియదా?
మలైక అరోరా ఇది వరకే చాలాసార్లు తన డ్రెస్సింగ్ స్టైల్ తో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయింది ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ తో వచ్చింది అంటూ ఓ వర్గం నెటిజన్లు ఊహించని విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 50 ఏళ్ళ వయసులో కూడా నీకు డ్రెస్ ఎలా వేసుకోవాలో తెలియదా అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఆ డ్రెస్ అయితే ఏ మాత్రం బాగోలేదు అని అదొక చీప్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

కరణ్ పార్టీలో బాలీవుడ్ స్టార్స్
మలైకా అరోరా ఇలాంటి ట్రోలింగ్స్ ఎన్ని వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోదు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆమె మాత్రం పార్టీలో కెమెరాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. కాజోల్, కరీనా కపూర్, షాహిద్ కపూర్, అనుష్క శర్మ, సిద్ధార్థ మల్హోత్రా.. ఇలా చాలా మంది బాలీవుడ్ నటీనటులు పార్టీలో పాల్గొన్నారు.