అవికా గోర్ తో రహస్యంగా ఓ బిడ్డ.. అందుకు రిలేషనే కావాలా.. నటుడు షాకింగ్ కామెంట్స్!
తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు గా పరిచయమైన అవికా గోర్ ఆ తర్వాత తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన ఈ భామ సడన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే గతంలో ససురాల్ సిమర్ కా అనే సీరియల్ లో నటిస్తున్న సమయంలో ఈ భామ ఆ సీరియల్ లో సహ నటుడు మనీష్ తో కలిసి పని చేస్తూ ప్రేమలో పడిందని ఆయనతో ఏకంగా ఒక బిడ్డను కూడా కనేసిందని ప్రచారం జరుగుతూ ఉండగా దాని మీద నిన్న ఆమె స్పందించింది. ఇప్పుడు ఆ విషయం మీద సదరు నటుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే

ఓ బిడ్డను కన్నామని
నిన్న ఈ అంశం మీద స్పందించిన అవికా.. ఆయనతో బిడ్డను కనేందుకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పింది. 'మేం ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారని అయితే. అది పూర్తిగా అవాస్తవం అని చెప్పుకొచ్చింది. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనీష్ నాకు మంచి స్నేహితుడని, ఆయనకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చింది.

మేమిద్దరం మాట్లాడుకోలేదు
అంతేకాక ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. మా మధ్య ఏదైనా జరిగిందేమోనని ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారని 'కానీ ఏం ఆయన మా నాన్న కంటే కొంచెం చిన్న వాడని చెప్పుకొచ్చింది. అయితే మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని వచ్చిన పుకార్లు మొదట్లో మా మీద ప్రభావాన్ని చూపించి, ఏకంగా రెండు వారాలపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదని చెప్పుకొచ్చింది. అయితే మళ్ళీ మళ్ళీ పుకార్లు వస్తూనే ఉంటడంతో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌లా కలిసిపోయామని చెప్పుకొచ్చింది.

మిలిందే కారణం
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను అలా తాను మళ్లీ మనిషిగా మారడానికి తన ప్రియుడు మిలింద్ చంద్వాణీనే కారణమని చెప్పింది. గత రెండేళ్లుగా అతనితో డేటింగ్ చేస్తున్నానని కూడా ఆమె వెల్లడించింది. ఇక నన్ను నేను అర్థం చేసుకోవడానికి మిలింద్ ఎంతో సహకరించాడని అవికా చెప్పుకొచ్చింది. శారీరకంగా, మానసికంగా తనలో మార్పు రావడానికి మిలిందే కారణమని ఆమె వెల్లడించింది.

స్నేహం మాత్రమే
నటుడు మనీష్ మాట్లాడుతూ అవికాతో తనది స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు. నేను ఇప్పటివరకు విన్న అత్యంత అసంబద్ధమైన విషయాలలో తనకు ఆమెకు బిడ్డ ఉండడం అని ఆయన అన్నారు. ఇద్దరు వ్యక్తులు ఎందుకు మంచి స్నేహితులుగా ఉండలేరు? వారు ఎందుకు రిలేషన్ లో ఉండాలి? అని అన్నారు. నేను ఆమె కంటే 18 సంవత్సరాలు పెద్దవాడిని అని పేర్కొన్న ఆయన అవికా ఎప్పుడూ మంచి స్నేహితురాలిగా ఉంటుందని అన్నారు.

విని నవ్వుకున్నా
అంతేకాక ఆమె ఇప్పుడు మిలింద్ చాంద్వానీతో మంచి రిలేషన్ లో ఉందని చెప్పుకొచ్చారు. ఇక నేను 2020 జూన్ లో వివాహం చేసుకున్నానని, చేసుకుని ఒక సంవత్సరానికి పైగా అయ్యిందని అన్నారు. ఈ పుకార్ల గురించి సంగీత నేను విని నవ్వుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మనీష్ తాను ప్రేమించిన సంగీత చౌహాన్‌ను గత ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











