The Family man 2 వివాదం.. గుట్టువిప్పిన మనోజ్ బాజ్‌పేయ్

గత ఏడాది కాలంగా ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్‌ వివాదంలో కూరుకుపోవడం మీడియాలోను, అభిమానుల్లోను చర్చనీయాంశమైంది. తమిళ సంస్కృతి, మనోభావాలు, ప్రత్యేక దేశం కోసం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని కించపరిచే విధంగా ఉందనే ఆరోపణలతో ఈ వెబ్ సిరిస్‌పై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాయడం అత్యంత వివాదంగా మారింది.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం నేపథ్యంలో తమిళ ప్రజల మనోభావాలను కించ పరచలేదు. ఈ సిరీస్ విడుదలయ్యేంత వరకు వేచి చూడండి. అప్పుడే అసలు విషయం తెలుస్తుంది. అపోహలు తొలిగిపోతాయి అంటూ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే వివరణ ఇచ్చారు.

అయితే ఈ వివాదంపై ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో అత్యంత కీలక పాత్రధారి, శ్రీకాంత్ తివారీ రోల్‌లో కనిపించే మనోజ్ బాజ్‌పేయ్ తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై వివరణ ఇచ్చారు.

Manoj Bajpayee given clarity on The Family Man Season 2 controversy

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ కోసం పనిచేసిన వారందరిలో ఎక్కువగా తమిళులే ఉన్నారు. సమంత, ప్రియమణి, రైటర్ సుమన్ వీరంతా తమిళులే. ఇక దర్శకులు రాజ్ అండ్ డీకే, ఇతర లీడింగ్ టీమ్‌కు కూడా తమిళ ప్రజల మనోభవాలు, ఆకాంక్షలు స్పష్టంగా తెలుసు. తమిళ సంస్కృతి, వారి మనోభావాలను గుర్తించి.. ఈ షోను వివాదాలకు తావు లేకుండా కంటెంట్‌ను రూపొందించారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ తర్వాత ఈ షో గురించి అందరూ గర్వంగా ఫీలవుతారు. ఆ తర్వాత తమిళ సంస్కృతి, మనోభావాలపై గౌరవం పెరుగుతుంది. ఈ షోలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది అని మనోజ్ బాయ్‌పేయ్ పేర్కొన్నారు. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ షో జూన్ 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X