Don't Miss!
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ విషయంలో వాడి వేడి చర్చ.. బీసీసీఐకి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్?
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- News
తెలంగాణా బడ్జెట్ హైలైట్స్: బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట; కేసీఆర్ మార్క్ బాహుబలి బడ్జెట్ కేటాయింపులిలా!!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో ట్విస్ట్.. కోర్టు మందలింపు.. ఒక్కరోజుకే ప్రత్యక్ష సాక్షి మృతి?
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో పెద్ద ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ముఖ్యమైన సాక్షి ప్రభాకర్ సెయిల్ మృతి చెందారు. శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రభాకర్ ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టిన క్రమంలో ఇప్పుడు సెయిల్ మరణం కూడా చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్‌సిబి అరెస్టు
ముంబైలోని క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ శుక్రవారం కన్నుమూశారు. అతని న్యాయవాది తుషార్ ఖండారే ప్రకారం, చెంబూర్‌లోని మహుల్ ప్రాంతంలోని తన నివాసంలో ప్రభాకర్ సైల్ గుండెపోటుతో మరణించాడు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారని ప్రభాకర్ సెయిల్ ఆరోపించారు.
ఆ తర్వాత సమీర్ వాంఖడే పై విచారణ ప్రారంభమైంది. అక్టోబరు 2న జరిగిన దాడి తర్వాత, డ్రగ్స్ పార్టీ చేసుకున్నందుకు ఆర్యన్‌తో పాటు మరో 7 మంది నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు అతన్ని ఎన్‌సిబి అరెస్టు చేసింది. దీని తరువాత, కోర్టు అతన్ని ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచింది.

వాంఖడేకు లంచం
ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఎన్‌సీబీ విజిలెన్స్ బృందం ప్రభాకర్ సెయిల్‌ను కూడా విచారణకు పిలిచింది. క్రూయిజ్ పార్టీ రైడ్ సమయంలో తాను గోసావితో ఉన్నానని ప్రభాకర్ సెయిల్ పేర్కొన్నాడు. ఫోన్ చేసి 25 కోట్లతో మొదలైన డీల్ ను 18 కోట్లకు ఫిక్స్ చేసేందుకు కేపీ గోసవి సామ్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడని ప్రభాకర్ వెల్లడించాడు. కెపి గోసావి ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు లంచం ఇవ్వడం గురించి కూడా వివరాలు బయట పెట్టాడు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి వీడ్కోలు
ఈ హై ప్రొఫైల్ కేసులో బాలీవుడ్ కింగ్ ఖాన్ గా పిలవబడే షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా అరెస్టయ్యాడు. 2 అక్టోబర్ 2021న ముంబై నుండి గోవాకు వెళ్తున్న క్రూయిజ్ షిప్‌పై సమీర్ వాంఖడే టీమ్ దాడి చేసింది. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ సహా 9 మందిని అరెస్టు చేశారు. అయితే ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. ఈ విషయంలో సమీర్ వాంఖడే గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. కోట్లాది రూపాయల స్కెచ్ ఉందని ఆరోపణల నేపథ్యంలో అయన ఏకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి వీడ్కోలు పలికారు.

ఒకరోజు తరువాత
ఇక ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడేకు వ్యతిరేకంగా గళం విప్పారు. అయితే, తన పోరాటం ఎవరి మతంతోనో, కులంతోనో కాదని, అన్యాయంతో నేనని నవాబ్ మాలిక్ అన్నారు. ఎన్‌సీబీ సమస్యను జటిలం చేసేలా పనిచేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు . ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయనందుకు ఎన్‌సీబీని కోర్టు మందలించిన ఒకరోజు తరువాత ప్రభాకర్ మృతి చెందడం చర్చనీయాంశం అయింది.

డబ్బు కోసం అలా
ఈ కేసులో పంచ సాక్షులలో ఒకరిగా ఉన్న ప్రభాకర్ తాను కెపి గోసావికి వ్యక్తిగత అంగరక్షకుడని పేర్కొన్నాడు. నిజానికి ఆర్యన్‌తో గోసావి సెల్ఫీ వైరల్‌గా మారింది. సెయిల్ అఫిడవిట్‌లో ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఆరోపణలు ఉన్నాయి. వాంఖడే కేసులో స్వతంత్ర సాక్షులు నిందితుల నుంచి దోపిడీకి ప్రయత్నిస్తున్నారని సెయిల్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి ఒత్తిడితో స్టేట్‌మెంట్ ఇవ్వడం లేదని, డబ్బు కోసం అలా చేయడం లేదని ప్రభాకర్ అన్నారు. తనకు ఏ మంత్రితోనూ సంబంధం లేదని అన్నారు.