Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బాలీవుడ్‌పై సౌత్ డామినేషనా? అంత సీన్ లేదు.. హిందీ ఫెయిల్యూర్‌కు కారణమిదే!
కోవిడ్ పరిస్థితుల తర్వాత దక్షిణాదిలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలు భారీగా రాణించాయి. మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ సినీ రంగాలు రికార్డు స్థాయి కలెక్షన్లతో అద్భుతంగా వెండితెరపైన కనక వర్షం కురిపించాయి. అయితే బాలీవుడ్ సినిమా పరిశ్రమ మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లపడింది. 2022 సంవత్సరంలో రిలీజైన చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ పరిశ్రమ కోలుకొంటున్నది. అయితే బాలీవుడ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ సీనియర్ నటి నీనా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే...
బాలీవుడ్ సినీ పరిశ్రమలో సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందలేకపోవడానికి ప్రధాన కారణం.. నేటి తరం హీరోలు ఆడియెన్స్‌ను మెప్పింపలేకపోయారు. వారు నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. అది కాకుండా కోవిడ్ పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల వద్ద డబ్బు లేకపోయింది. వినోదాన్ని ఆస్వాదించడానికి, సినిమాలపై వెచ్చించడానికి డబ్బు లేదు. కోవిడ్ తర్వాత సినిమాలకు ఫ్యామిలీ రాలేకపోవడానికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకొంత మంది వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. దాంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం తగ్గించారు. అందుకే ఈ బాలీవుడ్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే మంచి కంటెంట్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు అని నీనా గుప్తా అన్నారు.

అయితే బాలీవుడ్‌పై దక్షిణాది పరిశ్రమ డామినేట్ చేస్తున్నదని అంటే.. నేను ఒప్పుకోను. బాలీవుడ్ సినిమాలు ఆడకపోవడానికి ప్రేక్షకుల ఆర్థిక అంశాలే కారణం అని అన్నారు.
అయితే తాను నటించిన వధ్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను థ్రిల్లర్ సినిమాలు ఆడుతాయా? కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అంశాలను ఆధారంగా చేసుకొని స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకోను. నాకు నచ్చిన స్క్రిప్టును మాత్రమే అంగీకరిస్తాను. నన్ను ముందుగా ఎక్సైట్ చేయాలి. అప్పుడే ఆ సినిమాను చేస్తాను. అలాగే నేను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు.. ఉదయం లేవగానే షూటింగ్ కు వెళ్లాలని ఎక్సైట్ కలిగించాలి అని నీనా గుప్తా అన్నారు.
గత రెండు దశాబ్దాలుగా నీనా గుప్తా విభిన్నమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె ఇటీవల నటించిన బదాయిహో, పంచాయితీ సినిమాలతో నీనా గుప్తా విశేషంగా ఆకట్టుకొన్నది.