For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Neeraj Chopra బయోపిక్ కి సన్నాహాలు.. ఈ హీరోలు అయితే పోలికలతో సహా సెట్ అంతే!

  |

  స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారతదేశానికి ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ గెలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. బంగారు పతకం సాధించి ఆయన చరిత్ర సృష్టించాడు. ప్రపంచ నలుమూలల నుండి భారత ప్రజలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. శనివారం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో, పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ 87.58 ఉత్తమ త్రోతో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ స్థాయికి చేరుకోవడానికి నీరజ్ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగిపోలేదు.

  దీని వెనుక అతని కృషి, అంకితభావం, టెక్నిక్ మరియు ఏదైనా చేయాలనే కసి ఉన్నాయి. నీరజ్ ఒక హీరో కంటే ఏమాత్రం తక్కువ కాదు, సో ఈ 23 ఏళ్ల స్టార్ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. స్పోర్ట్స్ బయోపిక్స్ కి మంచి ఆదరణ లభిస్తున్న క్రమంలో నీరజ్ బయోపిక్ కోసం కొంతమంది నటులను, ఆయన ఫేస్ కట్స్ కి సూట్ అయ్యేవారిని మీ ముందు ఉంచుతున్నాము. వారిలో ఎవరు బెస్ట్ అని మీరు కూడా చూసి చెప్పండి.

   షాహిద్ కపూర్

  షాహిద్ కపూర్

  బాలీవుడ్ ప్రతిభావంతులైన నటులలో షాహిద్ కపూర్ ఒకరు అనడంలో సందేహం లేదు. మీరు గమనిస్తే, షాహిద్ మరియు నీరజ్ యొక్క శరీరాకృతి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇద్దరి లుక్స్ కూడా ఒకేలా ఉన్నాయి. మీరు నీరజ్ యొక్క కొన్ని పాత వీడియోలను చూస్తే, అతని జుట్టు కూడా షాహిద్ యొక్క 'దిల్ బోలే హడిప్ప', 'తేరి మేరి కహానీ', 'ఛాన్స్ పె డాన్స్' లుక్‌తో సరిగ్గా సరిపోతుంది. షాహిద్ ఇప్పటిదాకా ఎలాంటి బయోపిక్ కూడా చేయలేదు, కనుక ఇది అతనికి దొరికితే పెద్ద హిట్ కొట్టి నిరూపించుకోవచ్చు.

   సిద్ధార్థ్ మల్హోత్రా

  సిద్ధార్థ్ మల్హోత్రా

  సిద్ధార్థ్ పరిశ్రమలో అత్యంత అందమైన, స్టైలిష్ నటుల్లో ఒకరు. అతను తన శరీరం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఆయన వ్యాయామ వీడియోలలో కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, అతను నీరజ్ బయోపిక్ కోసం ఎంపికైతే, అతను ఆ పాత్రకు న్యాయం చేయగలడు. అతను సిల్కీ హెయిర్‌తో జావెలిన్ విసరడాన్ని చూస్తే నీరజ్ గుర్తు రాక మానడ.

   ఇషాన్ ఖట్టర్

  ఇషాన్ ఖట్టర్

  షాహిద్ కపూర్ మాత్రమే కాదు, అతని సోదరుడు ఇషాన్ ఖట్టర్ కూడా నీరజ్ కోసం రోల్ బెస్ట్ ఆప్షన్. అతని ఎత్తు దాదాపు నీరజ్ ఎత్తే. అలాగే అతను సినిమా కోసం తన బరువును పెంచుకుంటే, స్క్రీన్ మీద మ్యాజిక్ సృష్టించగలడు. 'బియాండ్ ది క్లౌడ్స్' మరియు 'ధడక్' వంటి చిత్రాలలో తన సత్తా నిరూపించుకున్నాడు.

  రణ్ దీప్ హుడా

  రణ్ దీప్ హుడా

  బాలీవుడ్‌లో అత్యంత చురుకైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడుతున్న రణదీప్ హుడా కూడా నీరజ్ రోల్ కి యాప్ట్. అంతేకాక 2018 లో ఒక ఇంటర్వ్యూలో, నీరజ్ తన అభిమాన హీరో గురించి అడిగినప్పుడు, అతను రణదీప్ పేరు వెల్లడించారు. ఇద్దరూ హర్యానా నుంచి వచ్చారు మరియు రణదీప్ కూడా క్రీడల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ విధంగా, నీరజ్‌గా రణదీప్ సూట్ అవ్వచ్చు కూడా.

  అక్షయ్ కుమార్

  అక్షయ్ కుమార్

  నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకున్నట్లు ప్రకటించిన వెంటనే, అక్షయ్ కుమార్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాడు. అక్షయ్ 'రుస్తమ్', 'ప్యాడ్‌మన్', 'గోల్డ్', 'కేసరి' వంటి చిత్రాలలో నిజ జీవిత పాత్రలను పోషించాడు. ఇది మాత్రమే కాదు, నీరజ్ అథ్లెట్ కాబట్టి, అతని పాత్రను పోషించే వ్యక్తి కూడా ఆ స్థాయికి తగినట్లుగా ఉండాలి మరియు ఫిట్‌నెస్ విషయంలో అక్షయ్ సూపర్ అందుకే ఆయన కూడా ఒకరకంగా మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

  హృతిక్ రోషన్

  హృతిక్ రోషన్

  'క్రిష్' లో సూపర్ హీరో, 'జోధా అక్బర్' లో అక్బర్ 'సూపర్ 30'లో ఆనంద్ కుమార్ అయినా హృతిక్ రోషన్ ఎలాంటి పాత్రలకు అయినా న్యాయం చేశాడు. నిజానికి గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ బయోపిక్ కోసం హృతిక్ ఖరారు అయినప్పుడు, అతను ఆ పాత్రను చేయగలడని ప్రజలు నమ్మలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత, అందరి సందేహాలు నివృత్తి అయ్యాయి. ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ జీవించి తీరు ప్రజల హృదయాలను తాకింది. హృతిక్ అన్ని రకాల పాత్రలను ఖచ్చితమైన రీతిలో పోషించగలడు మరియు అతను నీరజ్ పాత్రను అదే ఉత్సాహంతో పోషించగలడని చెప్పచ్చు.

   రణవీర్ సింగ్

  రణవీర్ సింగ్

  రణ్‌వీర్ సింగ్ 'లూటెరా', 'గోలియోన్ కి రస్లీలా రామ్-లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్' వంటి చిత్రాలతో తన నటన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. రాబోయే చిత్రం '83' లో, అతను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ రోల్ పాత్రలో కనిపించనున్నాడు, దీని ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. రణ్‌వీర్‌ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అతను పోషించిన పాత్రలో లీనమై, దానిని తన సొంతం చేసుకోవడం. సినిమా మొదలయ్యాక రణవీర్ తెరపై కనిపించడు, ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, రణవీర్ నీరజ్ బయోపిక్ కోసం ఎంపికైతే ఆ లెక్క వేరే ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

  English summary
  In order for sports biopics to be well received, we are putting in front of you some of the actors for the Neeraj biopic and those who suit his face cuts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X