#BoycottKareenaKhan in sita : బాయ్ కాట్ కరీనా కపూర్ ఖాన్.. శూర్పణఖ రోల్ కి మాత్రమే కరెక్ట్ !
సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఎక్కువగా పురాణాలు ఇతిహాసాలు ఆధారంగా చేసుకొని సినిమాలు తెరకెక్కించే పనిలో పడిన సంగతి తెలిసిందే. బాషతో సంబంధం లేకుండా ఇప్పటికే టాలీవుడ్ మొదలు అన్ని ఇండస్ట్రీలలో ఈ తరహా సినిమాలు చేసే పనిలో ఉన్నారు. బాలీవుడ్ లో కూడా చాలా ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రాజమౌళి తండ్రి కధ అందిస్తున్న సీత అనే సినిమా కోసం ఎంపిక అయిందని అంటున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఆమెను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

సీత పాత్రలో
బాహుబలి లాంటి భారీ చిత్రాలకు కథలు అందించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు సీత అనే పేరుతో తెరకెక్కబోతున్న సినిమాకి కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాసంలో రాముడి భార్య అయిన సీత కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ సీత పాత్రలో నటిస్తోందని అంటున్నారు.

రెండు కండిషన్లు
ఆమె సీత పాత్ర చేసేందుకు రెండు కండిషన్లు కూడా పెట్టగా ఆ రెండు కండిషన్లకు నిర్మాతలు ఒప్పుకున్నారని అంటున్నారు. అందులో మొదటి కండిషన్ ఏమిటంటే ప్రస్తుతం తాను చేస్తున్న అన్ని సినిమాలు పూర్తి అయ్యాకనే సీత సినిమా మొదలు పెడతానని ఆమె కండిషన్ పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వీరే కి వెడ్డింగ్ సీక్వెల్ అలాగే మరో పేరు పెట్టని సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. సదరు పేరు పెట్టని సినిమాకి హన్సల్ మెహతా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

పన్నెండు కోట్ల రెమ్యునరేషన్
ఇక రెండు, మూడు నెలల్లో ఈ రెండు సినిమాల షూటింగులు పూర్తి చేస్తానని ఆ తర్వాత మాత్రమే సీత షూటింగ్ కి హాజరు కాగలరని ఆమె తేల్చి చెప్పిందట. ఈ కండీషన్ కి మేకర్స్ ఒప్పుకున్నారని అంటున్నారు. అంతేకాక సీత సినిమా కోసం దాదాపు 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆమె డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలౌకిక దేశాయ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు.

డబుల్ ఛార్జ్
మామూలుగా కరీనా కపూర్ ప్రతి సినిమాకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ సీత సినిమా చేయడం కోసం చాలా రోజులు కష్టపడాల్సి వస్తుంది అలాగే వీలైనన్ని ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఆమె దాదాపు ఈ సీత సినిమాకి డబుల్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కూడా ఆమె డిమాండ్స్ కి ఒప్పుకున్నారని తెలుస్తోంది.

శూర్పణఖ రోల్ కి మాత్రమే కరెక్ట్
ఇప్పుడు ఈ అంశమే ఆమెను ట్విట్టర్ లో నెగటివ్ ట్రెండ్ అయ్యేలా చేసింది. ఆమె సీత పాత్ర కోసం అంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని చెబుతూ పెద్ద ఎత్తున ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఆమె శూర్పణఖ రోల్ కి మాత్రమే కరెక్ట్ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతే కాక ఈ రోల్ కు కంగనా కరెక్ట్ అని అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ఏమిటి అనేది చెప్పకున్నా, ఆమె ఖాన్ నీ వివాహం చేసుకోవడం వలనే ఇలా టార్గెట్ చేస్తూ ఉండి ఉండవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











