twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటుడు కన్నుమూత.. ఆలియాభట్‌తో అలా అనుబంధం.. అనిల్ కపూర్ దిగ్బ్రాంతి

    |

    బాలీవుడ్ నటుడు, స్క్రీన్ రైటర్ శివ్ సుబ్రమణ్యం ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శివ్ మరణవార్తను ఆయన సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన పరిందా, హజారోంకి క్వాయిషే ఐసీ అనే చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే. శివ సుబ్రమణ్యం మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    శివ సుబ్రమణ్యం 1989లో పరిందా అనే చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా, నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అలాగే అద్భుతం విజయం సాధించిన 1942: ఏ లవ్ స్టోరి, ఇస్ రాత్‌ కి సుభా నహీ, అర్జున్ పండిట్, ఛమేలి, తీన్ పత్తి చిత్రాలకు పనిచేశారు. టూ స్టేట్స్ అనే చిత్రంలో అలియా భట్‌కు తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. ముఖ్తీ బంధన్, స్టాన్లీ కా డబ్బా, తు హై మేరా సండే, ఉంగ్లీ, నెయిల్ పాలీష్ లాంటి టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. చివరిసారిగా కరణ్ జోహర్ ప్రొడక్షన్ నిర్మించిన మీనాక్షి సుందరేషన్ అనే చిత్రంలో చివరిసారిగా నటించారు.

    Parinda fame Shiv Subramaniam no more: Anil Kapoor condolences

    దర్శకుడు అశోక్ పండిట్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. గొప్ప నటుడు, మానవత్వం కలిగిన నా స్నేహితుడు శివ్ సుబ్రమణ్యం ఈ లోకాన్ని వీడారనే విషాద వార్తను తెలియజేయడానికి బాధతో ఉన్నాను. ఆయన మరణవార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆయన భార్య దివ్యకు, కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సంతాపం. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని ట్వీట్ చేశాడు.

    శివ సుబ్రమణ్యం మరణించారనే విషాద వార్తతో నేను నిద్రలేచాను. ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాను. నా గుండె ముక్కలైనంత పని అయింది అని దర్శకుడు హన్సల్ మెహతా ట్వీట్ చేశారు.

    శివ్ సుబ్రమణ్యంతో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ నటుడు అనిల్ కపూర్ గుర్తు చేసుకొన్నారు. పరిందా చిత్రంలో తొలిసారి కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆ తర్వాత 24 చిత్రం కోసం కలిసి పనిచేశాను. ఆ రోజులను మరిచిపోలేను. ఆయన గొప్ప నటుడు, అతడు ఇకలేరంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని అనిల్ కపూర్ పేర్కన్నారు.

    English summary
    Bollywood actor and screen writer Shiv Subramaniam no more: Anil Kapoor condolences that, I had the opportunity to work with Shiv first in Parinda and then in 24 and both the times he was exceptional. An excellent actor who will be truly missed…my heartfelt condolences to the family
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X