రాజ్ కుంద్రా నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు.. ఇంటర్నెట్‌లో ఫోన్ నెంబర్ లీక్: పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు విషయంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. పోర్న్ వీడియోలకు సంబంధించిన కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాపై గతంలోనే చాలా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హాట్ బ్యూటీ పూనమ్ పాండే కూడా అతనిపై ఆరోపణలు చేసింది. తనతో కూడిన కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు పూనమ్ పాండే 2019 లో బాంబే హైకోర్టులో రాజ్ కుంద్రాపై కేసు వేశారు.

జీవితంలో అతిపెద్ద తప్పు

జీవితంలో అతిపెద్ద తప్పు

పూనమ్ పాండే గత రెండేళ్లుగా రాజ్ కుంద్రాపై న్యాయ పోరాటం చేస్తోంది. అతనితో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద తప్పు అని చెప్పింది. అతను తనను బ్లాక్ మెయిల్ చేశాడని అలాగే తన ఫోన్ నంబర్ను ఇంటర్నెట్లో లీక్ చేశాడని వివరించింది. అశ్లీల దాడులకు సంబంధించి జూలై 19 న రాజ్‌ను అరెస్టు చేసి, జూలై 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచారు.

ఫోన్ నెంబర్ లీక్

ఫోన్ నెంబర్ లీక్

నేషనల్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనమ్ పాండే మాట్లాడుతూ 'రాజ్ కుంద్ర స్వయంగా' చట్టపరమైన చర్యలను స్వాగతిస్తున్నానని అంటూ రాజ్ తో పాటు అతని సహచరులు కూడా మోసం చేశారని తన ఫోన్ నంబర్లను కూడా లీక్ చేశారని పూనమ్ ఆరోపించారు. అతనితో వర్క్ చేయడమే నా పొరపాటు అని కూడా మాట్లాడింది.

 వారు మోసం చేస్తున్నారని అర్ధమయ్యింది

వారు మోసం చేస్తున్నారని అర్ధమయ్యింది

పూనమ్ మాట్లాడుతూ "నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కోసం వారితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, అది ఒక నెల పాటు కొనసాగింది, వారు మోసం చేస్తున్నారని. వృత్తిపరంగా లేరని అర్ధమయ్యింది. అప్పుడే నా ఒప్పందాన్ని తక్షణమే క్యాన్సిల్ చేసుకొని ముగించాను. వారితో వృత్తిపరమైన సహకారాన్ని పొందడం నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు.. అని పూనమ్ మాట్లాడింది.

రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు

రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు

వారు చేసేవన్నీ కూడా మోసాలు. ముందే నా జీవితం బహిరంగ పుస్తకంగా మారింది. నేను వారి నుంచి మరో స్థాయి గాయం ఎదుర్కొన్నాను. నా పాస్‌వర్డ్‌లు, ఆధారాలను వారి బృందంతో పంచుకున్నందుకు నాకు తగిన పాపమే ఎదురయ్యింది. అయితే మోసమని తెలిశాక నేను వారి నుంచి బయటకు రావాలని. అనుకున్నప్పుడు నాకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు.. అని పూనమ్ తెలిపింది.

Recommended Video

Poonam Pandey Special Surprise To Pawan kalyan | Filmibeat Telugu
 100% బ్లాక్ మెయిల్.

100% బ్లాక్ మెయిల్.

హాట్ షాట్స్ అనే యాప్ కోసం రాజ్ కుంద్రా నన్ను వ్యక్తిగతంగా కలిశాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత నా వీడియోలు కొన్ని వ్యక్తిగత సమాచారాన్ని అలాగే నా ఫోన్ నెంబర్ ను ఇంటర్నేట్ లో లీక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది 100% బ్లాక్ మెయిల్. నాకు రావాల్సిన ఎమౌంట్ గురించి నేను గట్టిగానే అడిగాను కానీ వాళ్ళు నా ఖాతాలు మరియు వ్యక్తిగత స్థలాన్ని హ్యాక్ చేశారని తెలిసి నేను ఆ తరువాత ఏం చేయలేకపోయాను అని పూనమ్ పాండే క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X