Raj Kundra ఇలాంటి నీచమైన పని చేస్తావా? డబ్బు, పరపతి పోయింది.. భర్తను కొట్టినంత పని చేసిన శిల్పాశెట్టి

ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిని విచారిస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత శనివారం బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిన తర్వాత రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి నివాసానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా ముందటే శిల్పాశెట్టిని ఆరు గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి మధ్య భారీగా వాగ్వాదం జరిగిందనే విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు. ఆ విషయంలోకి వెళ్తే..

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu

రాజ్ కుంద్రాను చూడగానే...

రాజ్ కుంద్రాను చూడగానే...

ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించిన ప్రకారం.. భర్త రాజ్ కుంద్రా నిర్వహించే పోర్న్ దందా గురించి శిల్పాశెట్టికి తెలియదు. భర్త చేసిన నిర్వాకంతో కోపంలో ఉన్న శిల్పాశెట్టి రాజ్ కుంద్రాను చూడగానే ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారి మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత భోరుమని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

సహనం కోల్పోయిన శిల్పాశెట్టి

సహనం కోల్పోయిన శిల్పాశెట్టి

జూన్ 24వ తేదీన శిల్పాశెట్టి నివాసంలో రాజ్ కుంద్రాను, ఆమెను విచారించాం. ఆ సమయంలో సహనం కోల్పోయిన శిల్పాశెట్టి పలు మార్లు భర్తపై గట్టిగా అరిచింది. అలాంటి పనులు చేయడానికి నీకేం ఖర్మ పట్టింది. అలాంటి నీచమైన పనలు చేసే అవసరం ఏర్పడింది. ఇలాంటి చెత్త పనులు ఎందుకు చేశావు అని శిల్పాశెట్టి నిలదీసింది అని క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు.

రాజ్ కుంద్రాతో మాటల యుద్దం

రాజ్ కుంద్రాతో మాటల యుద్దం

రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి మధ్య పెద్ద ఎత్తున్న మాటల యుద్ధం జరిగింది. ఓ దశలో ఆయన మీదకు ఉరికింది. క్రైమ్ బ్రాంచ్ టీమ్ మధ్యలో జోక్యం చేసుకొని అడ్డుకొన్నది. వారిద్దరి విడదీసి విచారించింది. పలు మార్లు అధికారుల వద్ద కంటతడి పెట్టుకొన్నది. నా జీవితాన్ని రాజ్ కుంద్రా నాశనం చేశాడని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేసింది అని పోలీసులు పేర్కొన్నారు.

యాడ్స్, డబ్బు పోయిందంటూ..

యాడ్స్, డబ్బు పోయిందంటూ..

యాప్స్ ద్వారా పోర్నోగ్రఫి కంటెంట్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేశారనే విషయం నాకు తెలియదు. ఈ కేసు కారణంగా రాజ్ కుంద్రా వ్యవహారంతో నా కుటుంబ ప్రతిష్ట భుగ్గి పాలైంది. ఇండస్ట్రీలో నా వ్యాపార ప్రకటనలకు సంబంధించిన యాడ్స్ క్యాన్సిల్ అయ్యాయి. దాంతో నాకు భారీగా ఆర్థిక నష్టం జరిగింది. సోసైటీలో అంత పేరు, ప్రతిష్టలు ఉన్నప్పుడు అలాంటి పనుల చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ శిల్పాశెట్టి వాపోయింది అని ముంబై పోలీసులు తెలిపారు.

రాజ్ కుంద్రాకు ముందే తెలుసు అంటూ

రాజ్ కుంద్రాకు ముందే తెలుసు అంటూ

పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అవుతారనే విషయం రాజ్ కుంద్రాకు ముందే తెలుసు. మార్చి నెలల ఈ కేసులో తొమ్మిది మంది అరెస్ట్ అయినప్పుడే అరెస్ట్ కావడం తథ్యం అనే విషయం రాజ్ కుంద్రాకు అర్ధమైంది. క్రైమ్ బ్రాంచ్ ముంబైకి చెందిన ప్రాపర్టీ సెల్ తన గురించి వాకబు చేస్తున్నదనే సమాచారం ఆయన వద్ద ఉంది. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X