twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. షూటింగులోనే దారుణంగా.. కార్గిల్‌లో ఏం జరిగిందంటే!

    |

    ఆషికీ చిత్రంతో దేశవ్యాప్తంగా రాహుల్ రాయ్‌ బ్రెయిన్ స్ట్రోక్‌తో ముంబైలోని నానావతి హాస్పిటల్‌ చేరారు. ఆయన పరిస్థితి ఆందోళనగా ఉందనే సన్నిహితులు, కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. కార్గిల్‌లో ప్రతికూల పరిస్థితుల్లో షూటింగ్ చేస్తూ అనారోగ్యం బారిన పడినట్టు సినిమా యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చావుతో పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. రాహుల్ రాయ్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు..

    90వ దశకంలో అషికీ చిత్రంతో

    90వ దశకంలో అషికీ చిత్రంతో

    90వ దశకంలో యువతను విశేషంగా ఆకట్టుకొన్న రాహుల్ రాయ్.. కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం కార్గిల్‌లో LAC: లివ్ ది బ్యాటిల్ ఇన్ కార్గిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్బంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. వెంటనే నానా పాటేకర్, ఆయన కుమారుడు మల్హార్ స్పందించి ప్రాథమిక చికిత్సకు సహాకారం అందించారు.

    కార్గిల్ నుంచి ముంబైకి తరలింపు

    కార్గిల్ నుంచి ముంబైకి తరలింపు

    బ్రెయిన్ స్ట్రోక్ గురైన రాహుల్ రాయ్‌ని సైనిక అధికారుల సహకారంతో కార్గిల్ నుంచి శ్రీనగర్‌కు హెలికాఫ్టర్‌లో తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముంబై‌లోని నానావతి హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం తన భార్య, సోదరికి రాహుల్ రాయ్ అనారోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు.

    మైనస్ 15 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో

    మైనస్ 15 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో

    రాహుల్ రాయ్‌ అనారోగ్యం బారిన పడటంపై దర్శకుడు నిషాంత్ మల్కాని స్పందిస్తూ.. గత రోజులుగా LAC: లివ్ ది బాటిల్ ఇన్ కార్గిల్ అనే చిత్ర షూటింగును కార్గిల్‌లో చేస్తున్నాం. ప్రస్తుతం అక్కడి వాతావరణం మైనస్ 15 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. సోమవారం వరకు బాగానే ఉన్నారు. మంగళవారం నుంచి కొంచెం నలతగా ఉన్నట్టు కనిపించాడు. డైలాగ్స్ సరిగా చెప్పలేకోపోయారు. వ్యాఖ్యాలుగా మార్చలేకపోయారు. మాటలు తడబడ్డాయి. సాయంత్రానికి కల్లా పరిస్థితి అసాధారణంగా కనిపించింది. అప్పుడే ఏదో జరగకూడనిది జరుగుతుందనే విషయం నాకు అనిపించింది అని అన్నారు.

     కార్గిల్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో

    కార్గిల్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో

    దాంతో రాహుల్‌ను వెంటనే కార్గిల్‌లోని మిలిటరీ హాస్పిటల్‌కు తరలించాం. సీటీ స్కాన్ తదితర పరీక్షలు చేయించాం. అక్కడే ప్రాథమిక చికిత్సను అందించి మెరుగైన సహాయం కోసం ముంబైకి తరలించే ఏర్పాట్లు చేశాం. సైనిక అధికారుల సహాయంతో రాహుల్‌ను ముందుగా శ్రీనగర్.. అక్కడి నుంచి ముంబైకి తరలించి నానావతి హాస్పిటల్‌లో చేర్పించాం అని దర్శకుడు నిషాంత్ మల్కాని వెల్లడించారు.

    అఫాసియా వ్యాధి కారణంగానే..

    అఫాసియా వ్యాధి కారణంగానే..

    రాహుల్ రాయ్ అఫాసియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల మాటలు తడపడటం, సరిగా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. మెదడులో రక్తం గట్టకట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరులకు విషయాన్ని చెప్పడానికి చాలా కష్టపడుతుంటారు. త్వరలోనే ఆయనకు సర్జరీ చేయనున్నారు. బ్రెయిన్‌లో స్టెంట్ వేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

    Recommended Video

    Psycho Varma: Pichodi Chetilo Rayi Song Teaser | Natti Kranthi
    17 రోజులుగా కార్గిల్‌లో షూటింగ్

    17 రోజులుగా కార్గిల్‌లో షూటింగ్

    LAC: లివ్ ది బాటిల్ ఇన్ కార్గిల్ చిత్రం కోసం రాహుల్ రాయ్ గత 17 రోజులుగా కార్గిల్‌లో షూటింగ్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో షూటింగు పూర్తయ్యే సమయంలోనే రాహుల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. డిసెంబర్ 1వ తేదీ కల్లా యూనిట్ అంతా ముంబైకి చేరుకొనే ప్లాన్‌లో ఉంది. ఈ సమయంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ చిత్రంలో కల్నల్‌గా నితిన్ కుమార్ గుప్తా అనే పాత్రలో నటిస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది.

    English summary
    Bollywood actor, Ashiqui fame Rahul Roy Shifted to Nanavati Hospital after Brain stroke in Kargil. He was in Kargil for 17 days. He was was airlifted to Mumbai from Srinagar after his health deteriorated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X