twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raj Kundra అరెస్ట్ వెనుక అసలు కారణాలు ఇవే.. కోర్టులో బయటపడిన నిజాలు.. ఎన్ని సంవత్పరాల శిక్షంటే!

    |

    ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న సంఘటలను డైలీ సీరియల్‌లా కొనసాగుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర క్రైంబ్రాంచ్ పోలీసులు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసులు అనేక విషయాలను జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. రాజ్ కుంద్రా గురించి వెలుగులోకి వచ్చిన విషయాలు ఏమిటంటే..

    తెరపైకి యష్ థాకూర్ పేరు

    తెరపైకి యష్ థాకూర్ పేరు

    పోర్న్ రాకెట్ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు యష్ థాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై బెదిరింపులకు పాల్పడి కొందరు డబ్బు లాగేశారు. ఈ కేసులో తాను బాధితుడిని అంటూ యష్ థాకూర్ ముంబై పోలీసులకు లేఖ రాశారు. అలాగే యష్ తరఫున కోర్టులో ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నా క్లయింట్ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. కావున వాటిని అన్ ఫ్రీజ్ చేయాలని కోర్టును కోరారు.

    శిల్పాశెట్టికి పెరుగుతున్న మద్దతు

    శిల్పాశెట్టికి పెరుగుతున్న మద్దతు

    రాజ్ కుంద్రా కేసులో ఆయన భార్య శిల్పాశెట్టిపై భారీగా సానుభూతి పెరుగుతున్నది. భర్త చేసిన తప్పులకు ఆమెను బాధ్యురాలిని చేయవద్దు అంటూ సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. శిల్పాశెట్టి మద్దతుగా నిలిస్తూ సినీ ప్రముఖుడు హన్సల్ మెహతా స్పందిస్తూ.. ఆమెకు మద్దతు తెలపకపోయినా ఫర్వాలేదు. ఆమెను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడవద్దు అని హన్సల్ మెహతా సూచించారు.

    ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం

    ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం

    రాజ్ కుంద్రా కేసును జస్టిస్ అజయ్ గడ్కరీ బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణా పాయ్ పలు విషయాలను వెలుగులోకి తెచ్చారు. భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా సినిమాలను నిర్మించారు. అవి చట్టవ్యతిరేకం. ఈ కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ వాటికి నిరూపించగలిగితే నిందితులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అని పాయ్ చెప్పారు.

    51 బూతు చిత్రాలు స్వాధీనం

    51 బూతు చిత్రాలు స్వాధీనం


    రాజ్ కుంద్రాకు సంబంధించిన హాట్ షాట్స్, బాలీ ఫేమ్ యాప్స్ నుంచి 51 బూతు సినిమాలను స్వాధీనం చేసుకొన్నామని బాంబే హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా, ర్యాన్ థోర్పే ఇద్దరు తమ ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూప్‌లను, చాట్స్‌ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారు. సాక్ష్యాలను రూపుమాపడానికి ప్రయత్నించారు. అందుకే అరెస్ట్ చేశాం అని పాయ్ పేర్కొన్నారు.

    లండన్ వేదికగా బూతు చిత్రాల నిర్మాణం

    లండన్ వేదికగా బూతు చిత్రాల నిర్మాణం

    భారతీయ శిక్ష్మాస్మృతి ప్రకారం రాజ్ కుంద్రా, అతని బావ ప్రదీప్ భక్షి చేసిన నేరాలు తీవ్రమైనవి. యాప్స్‌లో పోర్న్ చిత్రాలను స్ట్రీమింగ్ చేయడం చట్ట వ్యతిరేకం. వారి వద్ద నుంచి స్టోరేజ్ డివైస్‌లను స్వాధీనం చేసుకొన్నాం. ప్రదీప్ భక్షి పర్యవేక్షణలో హాట్ షాట్ యాప్ కార్యకలాపాలు లండన్ వేదికగా జరుగుతున్నాయి అని ముంబై పోలీసులు కోర్టుకు వెల్లడించారు.

    Recommended Video

    Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
    14 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్, వెబ్ పోర్టల్స్‌పై ఎఫ్ఐఆర్

    14 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్, వెబ్ పోర్టల్స్‌పై ఎఫ్ఐఆర్

    పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను జూలై 19వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రా దాఖలు చేసిన బెయిల్ కోర్టు తిరస్కరించింది. రాజ్ కుంద్రాకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే 14 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్, వెబ్ పోర్టల్స్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

    English summary
    Raj Kundra Porn Case Update: Offences attracts maximum of seven years’ punishment. Raj Kundra and Ryan Thorpe were arrested as they had started deleting WhatsApp group and chats, So destroying evidence
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X