For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. నా భర్త విడాకులు ఇచ్చినా పర్లేదు: రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్

  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. నటిగా ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది హాట్ బ్యూటీ రాఖీ సావంత్. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. యాక్టింగ్ పరంగా కాకుండా వివాదాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. అదే సమయంలో ఏదో ఒక వ్యవహారంలో తలదూర్చుతూ దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇక, ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ 14వ సీజన్‌లో పాల్గొన్న ఆమె.. ఫినాలేలో బయటకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాతృత్వం గురించి మనసులోని కోరికను బయటపెట్టింది. ఆ వివరాలు మీకోసం!

  అలా ఎంట్రీ.. అన్ని భాషల్లోనూ యాక్టింగ్

  అలా ఎంట్రీ.. అన్ని భాషల్లోనూ యాక్టింగ్


  ‘అగ్నిచక్ర' అనే సినిమాతో రాఖీ సావంత్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో భాషల సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగులోనూ ‘6టీన్స్'లో నటించింది. అలాగే, ‘ద్రోణ'లో ఐటమ్ సాంగ్ చేసింది.

  వివాదాలతో సతమతం.. అందుకే ఫేమస్

  వివాదాలతో సతమతం.. అందుకే ఫేమస్


  ఎంతో కాలంగా సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తోన్న రాఖీ సావంత్.. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వివాదాల్లో భాగం అయింది. చాలా మందిపై విమర్శలు చేయడంతో పాటు కొందరిని టార్గెట్ చేసి ఆరోపణలు చేయడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తుండేది. అంతేకాదు, అప్పుడప్పుడూ హాట్‌గానూ కనిపించి షాకిచ్చేది. ఓ సందర్భంలో న్యూడ్ వీడియోతో ఈమె సంచలన అయింది.

  అప్పుడు నాలుగో స్థానం.. ఇప్పుడు ఐదు

  అప్పుడు నాలుగో స్థానం.. ఇప్పుడు ఐదు

  బుల్లితెర చరిత్రలోనే బిగ్ బాస్ షోది ప్రత్యేకమైన స్థానం. మరీ ముఖ్యంగా ఇది హిందీలో 14 సీజన్లను పూర్తి చేసుకుంది. రాఖీ సావంత్ మొదటి సీజన్‌లోనే కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. అయితే, ఇటీవల ముగిసిన 14వ సీజన్‌లో ఛాలెంజర్‌ కోటాలో షోలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఫినాలేలో రూ. 14 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసింది.

  బిగ్ బాస్‌లో షాకింగ్‌గా.. అన్నీ లీక్ చేస్తూ

  బిగ్ బాస్‌లో షాకింగ్‌గా.. అన్నీ లీక్ చేస్తూ

  రెండోసారి వచ్చిన బిగ్ బాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో రాఖీ సావంత్ కనిపించింది. ఇందులో భాగంగానే తన వ్యవహార శైలితో ప్రేక్షకుల దృష్టిలో పడింది. కంటెస్టెంట్లతో ప్రవర్తించిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను లీక్ చేసి సానుభూతిని పెంచుకుంది. తద్వారా ఫినాలేలో అడుగు పెట్టిందీ హాట్ బాంబ్.

  నా పెళ్లి ఒక స్కామ్ అంటూ షాకిచ్చింది

  నా పెళ్లి ఒక స్కామ్ అంటూ షాకిచ్చింది

  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో రాఖీ సావంత్.. తన భర్త గురించి సంచలన విషయాలు బయట పెట్టింది. ‘నా పెళ్లి ఒక స్కామ్‌. అతడికి పెళ్లైందన్న విషయం ముందే తెలిసి ఉంటే నేను పెళ్లి చేసుకునే దాన్ని కాదు. అత‌డి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడే నా బంధం ముగిసింది. నా స్వార్థం కోసం ఒక భార్య‌, పిల్లల జీవితాల‌ను ప‌ణంగా పెట్ట‌లేను' అంటూ చెప్పుకొచ్చిందామె.

  నా భర్త విడాకులు ఇచ్చినా పర్లేదంటూ

  నా భర్త విడాకులు ఇచ్చినా పర్లేదంటూ

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలు వెల్లడించింది. ‘నేను 14 లక్షలు తీసుకుంది నా తల్లి కోసం. ఇప్పుడామెకు వైద్యం చేయిస్తున్నా. అలాగే, నా భర్త గురించి హౌస్‌లో చేసిన కామెంట్ల వల్ల అతడు విడాకులు ఇస్తాడేమో. అలా చేసినా నాకు అభ్యంతరం లేదు' అంటూ వెల్లడించింది.

  వాటి అవసరం లేకుండానే తల్లినవుతా

  వాటి అవసరం లేకుండానే తల్లినవుతా


  తన మాతృత్వం గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తల్లినవ్వాలని ఉంది. ఇప్పటికే నా అండాలను భద్రపర్చాను. కానీ నాకు విక్కీ డోనార్‌ అవసరం లేదు. నా బిడ్డకు నిజమైన తండ్రి కావాలి. ఒంటరి తల్లిగా ఉండటం నాకస్సలు ఇష్టం లేదు. ఇదెలా సాధ్యం అవుతుందో తెలియదు కానీ త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా' అంటూ రాఖీ తన మనసులోని మాటను బయటపెట్టింది.

  English summary
  Rakhi Sawant is an Indian dancer, model, actress and television talk show host, who has appeared in many Hindi and a few Kannada, Marathi, Odia, Telugu and Tamil films and was a contestant on the first season of the controversial Indian reality television series Bigg Boss 1 (2006) and as a challenger and finalist in Bigg Boss 14 (2020).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X