»   »  హీరోను నగ్నంగా చిత్రీకరించారు: ఫ్యాన్స్ ఇలా చేశారంటూ మీడియాతో స్టార్ హీరో గోడు....

హీరోను నగ్నంగా చిత్రీకరించారు: ఫ్యాన్స్ ఇలా చేశారంటూ మీడియాతో స్టార్ హీరో గోడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.... తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ కాపాడుకుంటూనే 'పద్మావత్' లాంటి చిత్రాల్లో అల్లాఉద్దీన్ ఖిల్జీ లాంటి విభిన్నమైన విలన్ రోల్స్ చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల ఓ మీడియా ఈవెంటులో పాల్గొన్న రణవీర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక నటుడిగా అభిమానులను కలిగి ఉండటం, తనపై మీడియాతో పాటు ఫ్యాన్స్ అటెన్షన్ కలిగి ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాని, అదే సమయంలో ఈ స్టార్ హోదా కొన్ని సందర్భాల్లో తనను ఇబ్బందుల్లో పడేస్తుందని తెలిపారు.

ఓ అభిమాని నగ్నంగా చిత్రీకరించాడు

ఓ అభిమాని నగ్నంగా చిత్రీకరించాడు

ఈ సందర్భంగా తనకు ఎదురైన ఓ సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు రణవీర్. ‘ ఓసారి జిమ్‌లో వర్కౌట్స్ చేసిన అనంతరం అక్కడే ఉన్న బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లాను. స్నానం ముగిసిన అనంతరం ఒంటిపై టవల్ కూడా లేకుండా నగ్నంగా బయటకు వచ్చాను. నేను బాత్రూం నుండి బయటకు వస్తుంటే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన ఓ అభిమాని తనను సెల్ ఫోన్లో చిత్రీకరించడం మొదలు పెట్టాడు. అది చూసి షాకయ్యాను. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశాను.' అని రణవీర్ సింగ్ గుర్తు చేసుకున్నారు.

 టాయిలెట్లో కూడా వదల్లేదు

టాయిలెట్లో కూడా వదల్లేదు

కేవలం ఈ సంఘటన మాత్రమే కాదు... ఓ సారి టాయిలెట్లో ఉండగా ఓ వ్యక్తి నన్ను చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడి ఫోన్ చెక్ చేశాను. ఇలా కొందరు అభిమానుల వల్ల ఒక్కోసారి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని రణవీర్ సింగ్ తెలిపారు.

 నా గురించి చెత్తగా మాట్లాడారు

నా గురించి చెత్తగా మాట్లాడారు

ఓసారి ముంబై జుహులోని మల్టీప్లెక్స్ వద్ద ఉన్నపుడు నా గురించి కొందరు విమర్శిస్తూ మాట్లాడుకోవడం విన్నాను. అది ‘బ్యాండ్ బాజా బారాత్' సినిమా విడుదల సమయం. యష్ రాజ్ ఫిలింస్ వారు పరిచయం చేస్తున్న కొత్త హీరో ఇతడే, వీడేంటి ఇలా ఉన్నాడు అని నా లుక్స్ గురించి విమర్శిస్తూ మాట్లాడుకోవడం విని చాలా బాధేసింది. అప్పటికి ఆ సినిమా విడుదల కాలేదు. ఇలా చాలా జరిగాయి అంటూ రణవీర్ సింగ్ గుర్తు చేసుకున్నారు.

రణవీర్ సింగ్ మూవీస్

రణవీర్ సింగ్ మూవీస్

రణవీర్ సింగ్ సినిమాల విషయానికొస్తే... ‘పద్మావత్' తర్వాత ప్రస్తుతం ‘గుల్లే బాయ్' అనే చిత్రం చేస్తున్నాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అలియా భట్, కల్కి కొచ్లిన్, పూజా గౌర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Actor Ranveer Singh was present at media event, Recalling a bizarre experience that happened with him after a workout session at a gym, he said, "Once, I was getting out of the bathroom in the dressing room and there was this guy filming me while I was buck naked. I ran across and grabbed the phone, while I was naked and deleted the video immediately."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X