Don't Miss!
- News
వైఎస్ వివేకా హత్య కేసులో మున్ముందు అనూహ్య పరిణామాలు?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Raveena Tandon కూతురు హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ.. టాప్ డైరెక్టర్ ఎవరంటే?
సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు తమ వారసులను పరిచయం చేయడం కొత్తేమీ కాదు. వెండితెర మీద అద్బుతంగా రాణించిన ఎంతో మంది సీనియర్ యాక్టర్లు ఇప్పటికే తమ వారసులను సినీ రంగంలోకి ప్రవేశ పెట్టి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా హిందీ, తెలుగు, కన్నడ రంగాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రవీనా టాండన్ తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు ప్లాన్ సిద్దం చేసింది. ప్రముఖ దర్శకుడు రూపొందించే సినిమా ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ హీరోయిన్‌గా మారడానికి అన్ని రకాల శిక్షణలను పూర్తి చేసుకొన్నది. అయితే సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా ఆలీ ఖాన్‌తో కేదారినాథ్ రూపొందించిన దర్శకుడు అభిషేక్ కపూర్ రూపొందించే సినిమా ద్వారా రాషా టాండన్ రెడీ అవుతున్నది. వేసవిలో ప్రారంభమయ్యే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ద్వారా అమన్ దేవగన్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

ఫిల్మ్ మేకర్ అభిషేక్ కపూర్ విషయానికి వస్తే.. గతంలో సినీ పరిశ్రమకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఫర్షాన్ అఖ్తర్, రాజ్‌కుమార్ రావు, సారా ఆలీ ఖాన్ పరిచయం చేసి వారికి బ్రహ్మండమైన కెరీర్‌ను అందించడంలో సక్సెస్ అయ్యాడు. గతంలో కాయ్ పో చే, ఫితూర్, చండీగఢ్ కరే ఆషికి, కేదారినాథ్ చిత్రాలను అభిషేక్ కపూర్ రూపొందించారు.
అయితే రాషా టాండన్ బాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అధికారికంగా చిత్ర యూనిట్‌తో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.