బిలియనీర్ కొడుకుతో దీపికా పదుకొనె ప్రేమాయణం.. హోటల్‌లో ఆ పనితో బ్రేకప్
ఇప్పుడంటే పాన్ ఇండియా చిత్రాల ధాటికి బాలీవుడ్ పరిస్థితి దిగజారింది కాదని.. దేశంలో అగ్రశ్రేణి చిత్ర పరిశ్రమగా హిందీ ఇండస్ట్రీనే ఎక్కువ మంది పరిగణిస్తారు. భారతదేశాన్ని దాటి అనేక దేశాల్లో బాలీవుడ్ సినిమాలకు బలమైన మార్కెట్ ఉంది. హాలీవుడ్ స్టార్స్ రేంజ్‌లో స్టార్‌డమ్ ఉంది బాలీవుడ్ స్టార్స్‌కేనని చెబుతారు. అందుకే దేశంలోని నటీనటులు బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని, స్టార్ డమ్ అందుకోవాలని భావిస్తారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ల ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు చివరికి మాఫియా డాన్‌లతోనూ ప్రేమాయణాలు సాగించిన చరిత్ర హిందీ ముద్దుగుమ్మల సొంతం.
ఎఫైర్లతో వార్తల్లో నిలిచిన దీపికా పదుకొనె
గతంలోనే కాదు.. వర్తమానంలోనూ బాలీవుడ్ హీరోయిన్లు తమ ఎఫైర్లతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న దీపికా పదుకొనె కూడా పలువురితో ప్రేమాయణాలు సాగించారు. నిహర్ పాండ్యా, ఎంఎస్ ధోనీ, ముజామిల్ ఇబ్రహీం, రణబీర్ కపూర్, ఉపెన్ పటేల్, యువరాజ్ సింగ్‌లతో ఆమె డేటింగ్ చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే చివరికి బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడారు దీపిక.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా
2006లో తన మాతృభాష కన్నడంలో తెరకెక్కిన ఐశ్వర్య అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు దీపికా పదుకొనె. ఆ తర్వాత తన ఫోకస్‌ను బాలీవుడ్‌పై పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఓం శాంతి ఓం, లవ్ ఆజ్ కాల్, హౌస్‌ఫుల్, డమ్ మారో దమ్, కాక్‌టెయిల్, రేస్, దేశీ బాయ్స్, బాంబే టాకీస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూఇయర్, పీకూ, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, జీరో, బ్రహ్మస్త్ర పార్ట్ 1, పఠాన్, జవాన్, ఫైటర్ , సింగమ్ ఎగైన్ చిత్రాలతో బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గతేడాది విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమాతో తెలుగులోనూ అడుగుపెట్టారు దీపికా పదుకొనే. గతేడాది సెప్టెంబర్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ హీరోయిన్.. తిరిగి సినిమాలలో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం కింగ్ అనే సినిమాలో నటిస్తున్న దీపిక.. త్వరలో కల్కి 2లో జాయిన్ కానున్నారు.
విజయ్ మాల్యా కొడుకుతో డేటింగ్
ఇదిలాఉండగా కెరీర్ స్టార్టింగ్‌లో దీపిక పదుకొనె.. డేటింగ్ చేసిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్ధ్ మాల్యా కూడా ఉన్నారు. ఆమె అప్పట్లో ముంబై కంటే ఎక్కువగా బెంగళూరులోనే ఎక్కువగా కనిపించేవారు. ఐపీఎల్ ప్రారంభమయ్యాక.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. దాంతో దీపిక - సిద్ధార్ధ్‌లు ఐపీఎల్ మ్యాచ్‌లలో ఎక్కువగా కనిపించేవారు. అప్పుడే వీరి మధ్య ప్రేమాయణం సాగుతోందని మీడియా కథనాలు ప్రచారం చేసింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ సిద్ధార్ధ్ - దీపికలు విడిపోయారు.
ఆ ఘటనతో సిద్ధార్ధ్‌కు గుడ్‌బై
వీరిద్దరి బ్రేకప్‌పై చాలా మంది చాలా రకాలుగా వాదనలు వినిపించారు. బ్యాంకులకు రుణాల ఎగవేతతో విజయ్ మాల్యా లండన్ పారిపోవడం కూడా ఇద్దరి మధ్య గ్యాప్‌కు కారణమని అంటారు. అయితే ఎక్కువగా వినిపించేది మాత్రం ఓ హోటల్‌లో జరిగిన సంఘటనే. తొలినాళ్లలో దీపికకు డైమండ్ నెక్లెస్‌లు, ఖరీదైన వస్తువులు.. ఇలా ఏది అడిగితే అది కొనిచ్చాడట సిద్ధార్ధ్. అయితే తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయని దీపిక ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ క్రమంలో ఓ రోజున ఓ హోటల్‌కు వెళ్లి ఫుల్‌గా తినేసి దీపికతో బిల్ కట్టించాడట సిద్ధార్ధ్. ఈ సంఘటనను చాలా అవమానకరంగా భావించిన దీపిక.. తర్వాత సిద్ధార్ధ్ మాల్యాతో రిలేషన్‌కు బ్రేకప్ చెప్పేశారని బీటౌన్‌లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తుంటాయి.


Click it and Unblock the Notifications











