లేడీ గెటప్‌లో మగాళ్ల వాష్‌రూమ్‌కి స్టార్ హీరో... అందరూ రౌండప్ చేసి
సినిమాలలో కథ డిమాండ్ చేసిన మేరకు మన హీరోలు లేడీ గెటప్ వేసిన వారే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు స్త్రీ వేషంలో అద్భుతంగా నటించారు. టాలీవుడ్‌లోనే కాదు దేశంలోని అన్ని ఇండస్ట్రీలోని టాప్ హీరోలు లేడీ గెటప్ వేసిన వారే. అయితే ఓ స్టార్ హీరో లేడీ గెటప్ వేసుకున్న సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమాపై కపూర్ ఫ్యామిలీ ముద్ర
భారతీయ చిత్ర పరిశ్రమ రూపుదిద్దుకోవడంలో, ఎదుగుదలలో కీలకపాత్ర పోషించింది కపూర్ ఫ్యామిలీ. తొలుత పృథ్వీరాజ్ కపూర్.. ఆ తర్వాత ఆయన తనయులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్‌లు ఇండస్ట్రీ దిగ్గజాలుగా వెలుగొందారు. రాజ్ కపూర్ తర్వాత ఆయన తనయులు రిషి కపూర్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్‌లు పరిశ్రమలో అడుగుపెట్టారు. ముఖ్యంగా రిషి కపూర్ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకున్నారు.

బాలనటుడిగా అవార్డ్
1952 సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన ఆయన బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. 1973లో బాబీ అనే చిత్రంలో తొలిసారిగా హీరోగా నటించారు. తొలి సినిమాతోనే తన అందం, నటనతో చాక్లెట్ బాయ్‌గా అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచారు. బాబీ, లైలా మజ్ను, సర్గమ్, నగీనా, చాందినీ, హనీమూన్, దీవానా, గురుదేవ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 65 ఏళ్ల సినీ ప్రస్థానంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రవేశారు. తన సహనటి నీతూ కపూర్‌తో ప్రేమలో పడిన ఆయన 1980లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రణబీర్ కపూర్, రిధిమ కపూర్ సంతానం.
క్యాన్సర్‌తో తిరిగిరాని లోకాలకు
క్యాన్సర్ బారినపడిన రిషి కపూర్ 2020 ఏప్రిల్ 30వ తేదీన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2022లో చివరిసారిగా శర్మాజీ నమ్‌కీన్ మూవీలో రిషి కపూర్ నటించారు. ఆయన మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసినట్లయ్యింది. రిషి కపూర్ వారసుడిగా రణబీర్ కపూర్... కపూర్ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని అగ్రనటుల్లో ఒకడిగా ఆయన దూసుకెళ్తున్నారు.
లేడీ గెటప్‌లో అబ్బాయిల వాష్‌రూమ్‌కి
కాగా... రిషి కపూర్ 23 ఏళ్ల వయసులో మెరిసిపోయే గ్లామర్‌తో, సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న సమయంలో లేడీ గెటప్ వేశారు. అదే రఫూ చక్కర్. నరేందర్ బేడీ దర్శకత్వంలో 1975లో వచ్చిన ఈ సినిమాతో తన భార్య నీతూ కపూర్‌తో కలిసి నటించారు రిషి కపూర్. రాజీందర్ నాథ్, ఫర్యాల్, పెయింటాల్, ముంతాజ్ బేగమ్, మదన్ పూరి తదితరులు నటించారు. జమ్మూకాశ్మీర్‌లో ఈ సినిమా లోని కొంత భాగం షూటింగ్ జరిగింది. ఈ సమయంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లేడీ గెటప్‌లో ఉన్న రిషి కపూర్ షార్ట్ గ్యాప్‌లో వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది.
అయితే తాను ఆడ వేషంలో ఉన్న సంగతి మరిచిపోయి పురుషుల వాష్‌రూమ్‌కి వెళ్లారు రిషి కపూర్. తళతళలాడే అందంతో మెరిసిపోతూ, అమ్మాయిల్ని మించిన గ్లామర్‌తో ఉన్న రిషి కపూర్‌ని పురుషుల వాష్‌రూమ్‌లో చూసి అబ్బాయిలు షాకయ్యారట. అందరు గుమిగూడుతూ ఉండటంతో సిగ్గుపడిన రిషి కపూర్ విషయం గ్రహించి అక్కడి నుంచి పారిపోయారట. తర్వాత లేడీ గెటప్‌లో వచ్చింది రిషి కపూర్ అని తెలుసుకుని అక్కడున్న వారు నవ్వుకున్నారట.


Click it and Unblock the Notifications











