Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్
సినిమా రంగానికి చెందిన వాళ్లు ఏం చేసినా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వాళ్ల వాళ్ల పర్సనల్ విషయాలు అయితే ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు వివాహాలు చేసుకోవడం.. తల్లితండ్రులు కావడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, 'సాహో' ఫేం ఎవిలిన్ శర్మ తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా పెళ్లైన ఆరు నెలలకే కావడంతో ఈ వార్త భారీ స్థాయిలో హైలైట్ అవుతోంది. ఇక, తన బిడ్డ ఫొటోను కూడా ఎవిలిన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. రెండు దేశాల్లోనూ
ఎంతో కాలంగా ఇండియాలో పాపులర్ అవుతోన్న వారిలో ఎవిలిన్ శర్మ ఒకరు. ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లిది జర్మనీ. అందుకే రెండు దేశాల సంస్కృతులతో ఆమె ప్రయాణం సాగించింది. ఈ క్రమంలోనే జర్మనీలోనే విద్యాభ్యాసం పూర్తి చేయడంతో పాటు అక్కడే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అలా ఆరంభంలోనే అక్కడ.. ఆ తర్వాత ఇక్కడ మోడల్‌గా ఫేమస్ అయింది.
Unstoppable
with
NBK:
రెండు
ఎపిసోడ్లకే
ఆగిపోయిన
బాలకృష్ణ
షో..
అసలు
కారణం
చెప్పిన
ఆహా

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లోకి రాక
ఎలివిన్ శర్మ 'టర్న్ లెఫ్ట్' అనే ఇంగ్లీష్ చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో విడుదలైన ఈ మూవీతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇది వచ్చిన ఆరేళ్ల తర్వాత అంటే 2012లో 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుందీ ఇండో జర్మన్ బ్యూటీ.

‘సాహో'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ
బాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న సమయంలోనే ఎలివిన్ శర్మ.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో'లో కీలక పాత్రను పోషించింది. తద్వారా టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. ఇక, ఈ సినిమా చేస్తోన్న సమయంలో ఈ అమ్మడు హైదరాబాద్‌లో హల్‌చల్ చేసింది. అలాగే, ప్రభాస్ అంటే ఇష్టమని చెబుతూ అతడితో ఓ ఫొటోను కూడా దిగింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది.
సుమ షోలో రెచ్చిపోయిన లోబో: ఏకంగా ఆమెకు ముద్దులు.. ఇంట్లో ఎవరూ చేయట్లేదా అంటూ బూతులు

ఎప్పుడో నిశ్చితార్థం.. పెళ్లి ఇప్పుడు
'సాహో' సినిమాలో నటించిన తర్వాత ఎవిలిన్ శర్మ తన ప్రియుడు తుషాన్ భిండీతో నిశ్చితార్థం చేసుకుంది. వాస్తవానికి వీళ్లిద్దరూ అంతకు ముందు నుంచే డేటింగ్ చేస్తున్నారు. కానీ, 2019లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీని తర్వాత ఎలివిన్ శర్మ సినిమాలకు దూరం అయిపోయింది. ఇక, ఈ ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ నిరాడంభరంగా జరిగిన వేడుకలో పెళ్లి చేసుకున్నారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిందిగా
ఎవిలిన్ శర్మ తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. అంతేకాదు, తన కుమార్తెను ఎత్తుకున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. ఇందులోనే 'నా జీవితంలోనే ఎంతో ముఖ్యమైన పాత్ర ఇదే' అనే క్యాప్షన్‌ను కూడా పెట్టింది. దీంతో ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం
Recommended Video

గర్భవతిగా ఉన్నప్పుడే పెళ్లి జరిగ్గా
తుషాన్ భిండీతో ఎవిలిన్ శర్మ వివాహం జరిగి ఆరు నెలలు మాత్రమే అవుతోంది. అయితే, అంతకు ముందే ఆమె మూడు నెలల గర్భవతి అని తెలిసింది. అందుకే పెళ్లైన సమయంలోనే ఈ విషయం తెగ హాట్ టాపిక్ అయింది కూడా. ఇక, తన కుమార్తెకు 'అవభిండీ' అనే పేరును పెట్టింది ఎవిలిన్. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే ఆమె వెల్లడించింది.