కొడుకు విషయంలో సైఫ్ అలీ ఖాన్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారా?
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ముద్దుల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ కిడ్ కావడంతో మీడియా ఫోటోగ్రాఫర్లు ఈ పిల్లాడు ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అవుతూ ఫోటోలు తీయడం చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ల గ్రూఫు ఒకటి నిత్యం సైఫ్, కరీనా ఇంటి ముందు కాపుకాచుకుని ఉంటున్నారట. వీరి అత్యుత్సాహం వల్ల ఆ దారిలో వచ్చి వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పోలీసులు వచ్చి అక్కడి నుంచి ఫోటోగ్రాఫర్లను పంపించే ప్రయత్నం చేశారు. సైఫ్ అలీ ఖాన్ కంప్లయింట్ చేయడం వల్లనే పోలీసులు రంగంలోకి దిగినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాను పోలీసులకు ఎలాంటి కంప్లయింట్ చేయలేదని, ఫోటోగ్రాఫర్ల వల్ల ఇబ్బంది పడుతున్న మా ఇరుగుపొరుగువారు కంప్లయింట్ చేసి ఉండొచ్చు అని సైఫ్ వెల్లడించారు.

మేము మీడియా ఫోటోగ్రాఫర్లతో ఎల్లప్పుడూ రెస్పెక్టబుల్ రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాం. అదే సమయంలో మా పిల్లలు ఎలాంటి హడావుడి లేకుండా నార్మల్ వాతావరణంలో పెరగాల్సిన అసవరం ఉంది. ఈ విషయం కూడా ఫోటోగ్రాఫర్లు అర్థం చేసుకోవాలని సైఫ్ అన్నారు.
నేను తైమూర్‌తో ఉన్నపుడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఇష్టపడను. ఎందుకంటే.. కంటిన్యూగా వచ్చే కెమెరా ఫ్లాష్ వల్ల పిల్లల కళ్లు దెబ్బతింటాయి. సినిమా యాక్టర్లుగా మాకు మీడియా అటెన్షన్ అవసరమే, కాదనడం లేదు.. మమ్మల్ని ఫోటో తీసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ తైమూర్ లాంటి చిన్న పిల్లలకు ఈ వయసులో అది అవసరం లేదు అని భావిస్తున్నట్లు సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











