twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నార్త్‌లో మీ సినిమాలకు విశేష ఆదరణ.. సౌత్‌లో మా ఫిలింస్‌ను మీరు పట్టించుకోవడం లేదు.. చిరుతో సల్మాన్ కామెంట్స్

    |

    గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ముంబైలో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా, సత్యదేవ్, గెటప్ శ్రీను, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా, సౌత్ సినిమా అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఇండియన్ సినిమా మాత్రమే ఉంది. అప్పట్లో ఉన్న హద్దులను, భాషా బేధాలు తొలిగిపోయాయని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఏమిటంటే?

    గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్

    గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్

    లూసిఫర్ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఆ సినిమాలో ఆ పాత్రను దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశాడు. మా దర్శకుడు ఆ పాత్ర సల్మాన్ ఖాన్ చేస్తే బాగుంటుందని అడిగారు. అయితే వెంటనే సల్మాన్ ఖాన్‌కు ఫోన్ చేసి.. మా సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ఉంది. మీరు చేస్తే బాగుంటుందని అడిగాను. కావాలంటే ఆ క్యారెక్టర్ కోసం సినిమా చూడండని చెప్పాను. దాంతో సల్మాన్ ఖాన్.. చిరు గారు మీరు చేయమంటే చేస్తానని చెప్పాడు. ఆయన మాకు చాలా సహకారం అందించాడు చిరంజీవి చెప్పారు.

    రెమ్యునరేషన్ లేకుండా నటించిన సల్మాన్

    రెమ్యునరేషన్ లేకుండా నటించిన సల్మాన్

    ఇక సల్మాన్ ఖాన్ గొప్పతనం గురించి చిరంజీవి ప్రశంసల్లో ముంచెత్తారు. ఒక రోజు జరిగిన సంఘటనను చెబుతూ.. గాడ్‌ఫాదర్ సినిమాలో నటించినందుకు మా నిర్మాతలు సల్మాన్ ఖాన్‌కు గౌరవంగా కొంత రెమ్యునరేషన్ ఇవ్వాలని చెక్ ఇచ్చారు. అయితే వెంటనే ఆ చెక్‌ను సల్మాన్ ఖాన్ తిరిగి పంపించారు. దాంతో మేనేజర్ మా వద్దకు పరుగెత్తుకొంటూ వచ్చి.. చిరంజీవి, రాంచరణ్‌పై ప్రేమను, అభిమానాన్ని డబ్బుతో కొనాలని చూస్తున్నారా అని సల్మాన్ ఖాన్ అన్నారు సార్ అని చెప్పారు. సల్మాన్ ఖాన్‌కు చాలా గొప్ప హృదయం, ప్రేమ ఉంది. ఆయన ప్రేమకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం అని చిరంజీవి అన్నారు.

    ఇండియన్ సినిమా మాత్రమే

    ఇండియన్ సినిమా మాత్రమే

    గతంలో జర్నలిస్టులు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని సినిమాను విభజించారు. ఇప్పుడు మేము భారతీయ సినిమా పరిశ్రమను ఇండియన్ సినిమాగా మారుస్తున్నాం అని సల్మాన్ ఖాన్ అన్నారు. భారతీయులందరిది ఒకే ఎమోషన్, సినిమా అంటే చెప్పలేనంత అభిమానం అని అన్నారు.

    రాంచరణ్‌ను అక్కున చేర్చుకొని

    రాంచరణ్‌ను అక్కున చేర్చుకొని


    అయితే ప్రాంతాలను బట్టి సినిమా పరిశ్రమ కాకుండా ఇండియన్ సినిమాలో నేను భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. నాకు గతంలో హిందీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ RRR తో నా కుమారుడు రాంచరణ్‌ను ఉత్తరాది ప్రేక్షకులు అక్కున చేర్చుకొన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు, హిందీ సినిమాలు రెండు చోట్ల ఆడుతున్నాయి. భాష, ప్రాంతాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు అని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

    బాలీవుడ్‌ సినిమాలను పట్టించుకోవడం లేదు..

    బాలీవుడ్‌ సినిమాలను పట్టించుకోవడం లేదు..

    అయితే ఉత్తరాది ప్రజలు తెలుగు, దక్షిణాది సినిమాలను ఆదరిస్తున్నారు. కానీ బాలీవుడ్ సినిమాలను, ఉత్తరాది సినిమాలను తెలుగు, దక్షిణాది ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఆ విషయం మాటేమిటి? అని సల్మాన్ ఖాన్ ఫన్నీగా సెటైర్ వేశాడు. అయితే ఉత్తరాది ప్రేక్షకులు చాలా మెచ్యుర్డ్. మీ ఆడియెన్స్ అడ్వాన్స్‌డ్. అందుకే సౌత్‌లో మిమ్మల్ని పరిచయం చేయడానికే గాడ్‌ఫాదర్ సినిమాలో నటించమని అడిగాను. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హీరోలకు మంచి ఆదరణ దక్కుతుంది అని చిరంజీవి అన్నారు.

    English summary
    Bollywood Superstar Salman Khan and Mega Star Chiranjeevi coming together with GodFather movie. This movie trailer unveils at Mumbai. In this occassion, Salman Khan made interesting comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X