మరో తెలుగు సినిమాపై ఫోకస్ పెట్టిన సల్మాన్ ఖాన్.. రిలీజ్ కాకముందే రీమేక్ రైట్స్..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వేకుతున్న హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. కమర్షియల్ గా సినిమాలు చేయడంలో ముందుండే సల్మాన్ ఖాన్ ఇటీవల మరొక తెలుగు సినిమాపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎలాగైనా ఆ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకోవాలని చూస్తున్నాడట. అయితే ఆ తెలుగు సినిమా ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. మరి సల్మాన్ కు ఎవరు చెప్పారో గాని అప్పుడే నిర్మాతలతో తన టీమ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Recommended Video

Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Filmibeat Telugu
ఆ తెలుగు సినిమాలతో

ఆ తెలుగు సినిమాలతో

సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. అయితే అపజయాల్లో ఉన్న ప్రతిసారి కూడా సల్మాన్ ఖాన్ తెలుగు కథలతోనే హిట్స్ అందుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేవాడు. ఆ తరహాలో చేసిన పోకిరి , కిక్, రెడీ సినిమాలు సల్మాన్ కు మంచి విజయాన్ని ఇవ్వడమే కాకుండా మార్కెట్ డోస్ ను పెంచాయి.

పాటలు నచ్చడంతో

పాటలు నచ్చడంతో

సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలను చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటాడు. గతంలో ఎంతగానో హిట్టయిన రింగ రింగరే పాటను ఎంతో ఇష్టపడి హిందీలో లిరిక్స్ మార్చి అదే తరహలో వాడేశాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అంటే కూడా సల్మాన్ కు చాలా ఇష్టం. గతంలో దేవికి ఛాన్స్ వచ్చినప్పటికీ బిజీగా ఉండడం వలన చేయలేకపోయాడు.

రవితేజ సినిమా కోసం

రవితేజ సినిమా కోసం

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఒక తెలుగు సినిమాపై ఫోకస్ పెట్టినట్లు టాక్ అయితే వస్తోంది. రవితేజ నటించిన ఖిలాడి సినిమా కథ గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ విడుదల కాకముందే రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే తన టీమ్ తో నిర్మాతను సంప్రదించినట్లు తెలుస్తోంది.

విజయ్ సినిమా కోసం కూడా..

విజయ్ సినిమా కోసం కూడా..

ఇటీవల సల్మాన్ ఖాన్ రాధే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేసిన ఆ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో భాయ్ సేఫ్ జోన్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు.

అలాగే కోలీవుడ్ లో హిట్టయిన విజయ్ మాస్టర్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టినట్లు టాక్ వస్తోంది. ఆ సినిమా స్టోరీ లైన్ తో హిందీలో కొత్త తరహా సినిమా చేస్తే బావుంటుందని అనుకుంటున్నాడట. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X