మా నాన్నని చంపేశారు, వాళ్లని వదలను.. నాతో అసభ్యకరంగా అలా.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు!

భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి దశ కంటే రెండో దశలో ఈ కేసులు నమోదు ఎక్కువైపోయాయి.. కరోనా రెండో దశలో మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కూడా విధించారు. అయితే ఈ రెండో దశ కారణంగా అనేక మంది సినీ సెలబ్రిటీలు అలాగే సినీ సెలబ్రిటీల ఆత్మీయులు చనిపోతున్నారు. తాజాగా భోజ్ పూరి, హిందీ సినిమాల్లో నటించిన, బిగ్ బాస్ ఫేం సంభావన సేత్ తండ్రి కూడా కరోనా కారణంగా మరణించారు.. ఈ నెల ప్రారంభంలోనే తండ్రిని కోల్పోయిన ఆమె కేవలం మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఆయన మరణించారని ఆరోపించింది.

తండ్రి చనిపోయిన చాలా రోజుల తరువాత ఆమె ఆరోజు తీసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతేకాదు తన తండ్రి చికిత్స తీసుకున్న హాస్పిటల్ కి లీగల్ నోటీసులు కూడా పంపించింది.. ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొన్న ఆమె ఆ హాస్పిటల్ మీద న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నా అని పేర్కొంది. హాస్పిటల్ లో నర్సులు సైతం తనతో అసభ్యంగా, తప్పుగా ప్రవర్తించారని పేర్కొంది. తన తండ్రి ఆక్సిజన్ లెవెల్ 55 పడిపోయినా ఆక్సిజన్ శాచ్యురేషన్ బాగుందని నర్సులు చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది..

Sambhavna Seth alleges hospital murdered her father with medical negligence

అందరు డాక్టర్లు దేవుళ్లని నమ్ముతారని కానీ కొందరు ఇలాంటి దొంగ డాక్టర్లు కూడా ఉంటారని వాళ్లంతా రాక్షస జాతికి చెందిన వారని ఆమె ఆరోపించింది. తండ్రిని కోల్పోవడం జీవితంలో తాను ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య అని పేర్కొన్న ఆమె తన తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడుతానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ పోరాటంలో తాను గెలుస్తానో, ఓడిపోతే నాకు తెలియదు కానీ ఖచ్చితంగా తన తండ్రి మరణానికి కారణమైన వారిని మాత్రం బయటకు లాగుతాను అని ఆమె స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X