»   » ఎఫైర్ వార్తలే బాధించాయా? భగ్గుమన్న సంజయ్ దత్, లీగల్ నోటీసులు!

ఎఫైర్ వార్తలే బాధించాయా? భగ్గుమన్న సంజయ్ దత్, లీగల్ నోటీసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్, రచయిత యాస్సేర్ ఉస్మాన్ 'బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్' పేరుతో దత్ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని రాసిన సంగతి తెలిసిందే. ఇందులో యాస్సేర్ ఉస్మాన్ పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. మాధురి దీక్షిత్‌తో దత్ ప్రేమాయణం, ఆ సమయంలో అతడి మొదటి భార్య రిచా ఎంత వేదన పడిందో వివరిస్తూ పలు విషయాలు వెల్లడించారు. ఈ పుస్తకంలోని విషయాలు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వార్తలు సంజయ్ దత్‌ను బాధించాయి. దీంతో వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

నా అనుమతి లేకుండా బయోగ్రఫీ రాయడమేంటి?

నా అనుమతి లేకుండా బయోగ్రఫీ రాయడమేంటి?

యాస్సేర్ ఉస్మాన్ అనే వ్యక్తికి, దాన్ని ప్రచురించిన పబ్లికేషన్స్‌కు నా బయోగ్రఫీ రాయడానికి ఎలాంటి అనుమతి ఇవ్వ లేదని, అందులో పేర్కొన్న చాలా విషయాల్లో వాస్తవం లేదు అని సంజయ్ దత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 త్వరలో నా నిజమైన బయోగ్రఫీ తెస్తాను

త్వరలో నా నిజమైన బయోగ్రఫీ తెస్తాను

త్వరలో వాస్తవాలతో కూడాని నాయొక్క అసలైన బయోగ్రఫీ విడుదల చేయబోతున్నానని, యాస్సేర్ ఉస్మాన్ పుస్తకంలో తన గురించి రాసిన విషయాల్లో వాస్తవం లేదు అని సంజయ్ దత్ పేర్కొన్నారు.

 అదంతా నిజం కాదు

అదంతా నిజం కాదు

ఈ పుస్తకంలో కొన్ని విషయాలు మాత్రమే నా పాత ఇంటర్వ్యూల నుండి తీసుకున్నారు. చాలా వరకు 90ల్లో గాసిప్ మేగజైన్స్ ప్రచురించిన విషయాలను ప్రస్తావించారు. ఇదంతా నిజం కాదు... అని సంజయ్ దత్ తెలిపారు.

లీగల్ యాక్షన్

లీగల్ యాక్షన్

తన అనుమతి లేకుండా, అసత్యాలను ప్రచురించిన ఈ పుస్తకం విషయంలో లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు సంజయ్ దత్ వెల్లడించారు.

నన్ను, నా ఫ్యామిలీని బాధించాయి

నన్ను, నా ఫ్యామిలీని బాధించాయి

ఈ పుస్తకంలో పేర్కొన్న కొన్ని విషయాలు నన్ను, నా ఫ్యామిలీ బాధించాయని, ఈ విషయాన్ని తాను ఊరికే వదలిపెట్టబోను అని సంజయ్ దత్ తెలిపారు.

 సారీ చెప్పిన పబ్లికేషన్స్

సారీ చెప్పిన పబ్లికేషన్స్

అయితే తాము పబ్లిష్ చేసిన ఈ పుస్తకం కారణంగా సంజయ్ దత్ అప్‌సెట్ కావడంపై విచారం వ్యక్తం చేస్తూ..... జగ్గర్నౌట్ పబ్లికేషన్స్ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. ఈ సందర్భంగా దత్‌కు క్షమాపణలు తెలిసింది. యాస్సేర్ ఉస్మాన్ ఈ పుస్తకంలో రాసిన విషయాలకు పలు ఆధారాలు చూపడం వల్లనే తాము ప్రచురించామని తెలిపింది.

English summary
Sanjay Dutt has slammed author Yasser Usman’s upcoming biography on the star, saying that he has not authorised it. In a tweet posted on Tuesday, the actor said that he is considering taking legal action against Usman and Juggernaut Books for publishing stories that could hurt him and his family. He also promised to release his own, official autobiography soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X