twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్ దత్ ఇస్లాం స్వీకరించారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్...

    |

    బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇస్లాం స్వీకరించారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. అభిమానులు, నెటిజన్లలో ఈ పిక్ కొత్త అనుమానాలకు కారణం అవుతోంది. 59 ఏళ్ల సంజయ్ దత్ స్కల్ క్యాప్ ధరించి ఇఫ్తార్ విందు ఆరగిస్తున్నట్లు ఆ ఫోటో ఉంది.

    ఫేస్ బుక్ పేజీలో వైరల్ అవుతున్న అతడి ఫోటోపై సంజయ్ దత్ ఇస్లాం స్వీకరించినట్లు పేర్కొనబడింది. ఈ ఫోటోను వేల మంది షేర్ చేశారు. అయితే వైరల్ పోస్ట్ నిజం కాదని, మార్ఫింగ్ పిక్ అని నిపుణులు తేల్చేశారు. ఎవరో కావాలని దీన్ని క్రియేట్ చేసినట్లు స్పష్టం చేశారు.

    Sanjay Dutt fake Facebook post viral

    ఈ వైరల్ పిక్ నిజం కాదని తెలుపుతూ... అభిమానులు సంజయ్ దత్ రియల్ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫేక్ ఫోటోలు సర్క్యులేట్ చేయడం సర్వసాధారణం అయింది. కారణాలు ఏమైనా.... ఇపుడు సంజయ్ దత్ కూడా ఫేక్ బాధితుల లిస్టులో చేరిపోయారు.

    అయితే తనపై జరుగుతున్న ఈ ఫేక్ ప్రచారంపై సంజయ్ దత్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది సున్నితమైన అంశం కావడంతో ఆయన స్పందించే అవకాశం లేదని అంటున్నారు. సినిమా వాళ్లకు ఇవన్నీ సర్వసాధారణమే అని, పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు సైతం ఈ మ్యాటర్ అవాయిడ్ చేస్తున్నారు.

    సినిమాల విషయానికొస్తే... సంజయ్ దత్ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. టర్బాజ్ అనే మూవీతో పాటు పానిపట్, సడక్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగు హిట్ మూవీ 'ప్రస్తానం' హిందీ రీమేక్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు.

    English summary
    Sanjay Dutt fake Facebook post viral. A morphed picture of Sanjay Dutt wearing a skull cap is being spread on Facebook, claiming that the actor has changed his religion to Islam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X