»   » ఐశ్వర్యరాయ్‌పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన భన్సాలీ

ఐశ్వర్యరాయ్‌పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన భన్సాలీ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కాదని గులాబ్ జామూన్ కోసం అనురాగ్ కశ్యప్‌తో ఐశ్వర్యతో జతకట్టడం బాలీవుడ్‌‌లో వివాదంగా మారింది. భన్సాలీని ఆఫర్ తోసిపుచ్చడంపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. అయితే మీడియా కథనాలపై ఇటీవల ఐశ్వర్యరాయ్ స్పందించారు. భన్సాలీ అంటే నాకు అత్యంత గౌరవం. అతడితో కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్దమే అని చెప్పింది.

  తాను రూపొందించే చిత్రం నుంచి ఐశ్వర్య బయటకు వచ్చిందనే విషయం వివాదంగా మారడంపై భన్సాలీ స్పందించారు. బాజీరావు మస్తానీ, పద్మావతి చిత్రాల్లో దీపికా పదుకొన్ పాత్రను ముందుగా ఐశ్వర్యకు ఆఫర్ చేసిందనే వార్తల్లో వాస్తవం లేదు. పదేళ్ల క్రితం కరీనా కపూర్‌తో రూపొందించాలని బాజీరావు మస్తానీ చిత్రాన్ని ప్రకటించాం. కానీ కొన్ని కారణాల వల్ల కరీనా ఆ చిత్రంలో నటించలేదు. ఆమె స్థానంలో దీపికాను తీసుకొన్నామని భన్సాలీ చెప్పారు.

  Sanjay Leela Bhansali clear the air about Aishwarya Rai Bachchan

  గుజారీష్ తర్వాత భన్సాలీ రూపొందించిన ఏ చిత్రంలోనూ ఐశ్వర్యకు ఆఫర్ ఇవ్వలేదు. అయినప్పటికీ వారి మధ్య స్నేహపూరిత సంబంధాలున్నాయి. భన్సాలీ చిత్రాన్ని ఐశ్వర్య తిరస్కరించిందనే విషయం మీడియా సృష్టే అని భన్సాలీ సన్నిహితులు పేర్కొన్నారు.

  ఇదిలా ఉండగా, బాజీరావు మస్తానీలో నటించాలని నన్ను అడుగలేదు. కానీ పద్మావతి చిత్రంలో నటించమని కోరాడు. నా పక్కన ఖిల్జీ పాత్రకు ఎవరూ దొరకలేదు. దాంతో నన్ను పక్కన పెట్టి దీపికాను తీసుకొన్నారు. ఆ తర్వాత రణ్‌వీర్‌ను ఖిల్జీ పాత్రకు ఎంపిక చేశారు అని ఐశ్వర్య చెప్పడంతో గమనార్హం.

  ఐశ్వర్యరాయ్‌ని స్టార్ హీరోయిన్ చేయడం వెనుక భన్సాలీ కృషి ఉంది. ఆయన రూపొందించిన హమ్ దిల్ దే చుకే సనమ్, గుజారిష్, దేవదాస్ చిత్రాలు ఘనవిజయం సాధించడంతోపాటు ఐశ్వర్యకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

  English summary
  Bollywood actress Aishwarya Rai Bachchan choosing Anurag Kashyap's film Gulab Jamun, over Sanjay Leela Bhansali's movie goes viral in media. Aishwarya issued a statement saying that the reports were false and baseless, and that she has "immense love" for the Padmaavat director and wishes to work with him in future.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more