»   »  ‘సంజు’ సెలబ్రిటీ రివ్యూ: మూవీ చూస్తూ బాలీవుడ్ ప్రముఖుల కంటతడి!

‘సంజు’ సెలబ్రిటీ రివ్యూ: మూవీ చూస్తూ బాలీవుడ్ ప్రముఖుల కంటతడి!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ‘సంజు’ సెలబ్రిటీ రివ్యూ: మూవీ చూస్తూ బాలీవుడ్ ప్రముఖుల కంటతడి!

  రణబీర్ కపూర్, మనీసా కొయిరాల, పరేష్ రావల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు నటించిన బయోపిక్ మూవీ 'సంజు' జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈచిత్రం సినీ క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకోవడమే కాదు, ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటిటాక్ సొంతం చేసుకుంది. పలువుడు బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా చూసి తమ తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సినిమా మనసును టచ్ చేసిందని, కొన్ని సన్నివేశాలు చూస్తున్నపుడు ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నట్లు కొందరు చెప్పుకొచ్చారు.

  'సంజు' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సంజయ్ దత్ జీవితంలోని వివిధ కోణాలను దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎంతో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారనే ప్రశసలు వెల్లువెత్తుతున్నాయి.

  ఫాతిమా సనా ఖాన్

  ఫాతిమా సనా ఖాన్

  ‘దంగల్' నటి ఫాతిమా సనా ఖాన్ ‘సంజు' సినిమా చూసిన అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని, రణబీర్ కపూర్ నటన అమేజింగ్ అని, రాజ్ కుమార్ హిరానీ తెరపై అద్భుతం సృష్టించారని ట్వీట్ చేశారు.

  దివ్యా ఖోస్లా కుమార్

  దివ్యా ఖోస్లా కుమార్

  ఫిల్మ్ మేకర్ దివ్యా ఖోస్లా కుమార్ స్పందిస్తూ... ‘సంజు' ఒక అరుదైన సినిమా. మీరు తప్పకుండా ఎమోషనల్ అవుతారు, మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతారు అని తెలిపారు.

  జావెద్ జఫెరి

  జావెద్ జఫెరి

  నటుడు జావెద్ జఫెరి స్పందిస్తూ... ‘సంజు' రిమార్కబుల్ మూవీ. ఒక అద్భుతమైన సినిమా అందించినందుకు ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరానీకి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.

   సుభాష్ ఘై

  సుభాష్ ఘై

  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సుభాష్ ఘై స్పందిస్తూ... ‘సంజు' ఒక హార్ట్ టచింగ్ మూవీ, రాజ్ కుమార్ హిరానీ ఎంతో కమాండ్‌తో తన ఎఫర్ట్స్ అంతా పెట్టి తీసిన సినిమా ఇది అంటూ ప్రశంసించారు.

  షబానా అజ్మి

  షబానా అజ్మి

  ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ రియక్ట్ అవుతూ అమేజింగ్ సినిమా తీశారంటూ చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు.

  అవినాష్ గోవరికర్

  అవినాష్ గోవరికర్

  సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ రియాక్ట్ అవుతూ... ‘సంజు' సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను... ‘మైండ్ బ్లోయింగ్' అంటూ ట్వీట్ చేశారు.

  బోమన్ ఇరానీ

  ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్‌ ఇరానీ స్పందిస్తూ.... ‘ప్రతి మూడేళ్లకోసారి రాజ్‌కుమార్‌ హిరాణీ మనకు ఒక మంచి సినిమాను బహుమతిగా ఇస్తున్నారు. గత 15 ఏళ్లలో ఇది ఐదో సినిమా. ఎక్కువ సమయం తీసుకున్నావ్‌ రాజు.. దానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది' అంటూ ట్వీట్ చేశారు.

  కరణ్‌ జోహార్‌

  కరణ్‌ జోహార్‌

  కరణ్ జోహార్ స్పందిస్తూ... ‘ఈ తరంలో వచ్చిన నం.1 సినిమాగా దీన్ని పరిగణించాలి. రణ్‌బీర్‌ బ్రిలియంట్ అండ్ గిఫ్టెడ్ యాక్టర్, విక్కీ కౌశల్‌ చక్కటి స్టార్‌లా ఎదుగుతున్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న ఈ నటుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. భావోద్వేగాలతో కూడిన స్నేహితుడి పాత్రలో నటించి.. నన్ను ఏడిపించారు. ‘సంజు' టీంకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు.

  ధనుష్‌

  తమిళ స్టార్ ధనుష్‌ స్పందిస్తూ.... ‘‘సంజు' గురించి ఏం చెప్పను?.. రాజ్‌కుమార్‌ హిరాణీ ప్రతిసారి నీకిదెలా సాధ్యమౌతుంది? మైండ్‌బ్లోయింగ్‌.. నవ్వాను, ఏడ్చాను. రణ్‌బీర్‌ నీకు నా బిగ్‌ బిగ్‌ హగ్‌. హిరాణీ సర్‌.. మరోసారి నేను థియేటర్‌ నుంచి ఆనంద భాష్పాలతో బయటకు వచ్చేలా చేశారు... అంటూ ట్వీట్ చేశారు.

  English summary
  Ranbir Kapoor, Manisha Koirala and Paresh Rawal starrer Sanju has hit the theatres today on June 29, 2018 and has been receiving a lot of positive reviews from all corners. While the fans have loved the movie, our very own Bollywood celebrities gave out their reviews on Sanju and revealed that they were touched and even cried while watching the movie. The celebs have given Sanju a double thumbs up and it looks like the biopic on Sanjay Dutt is going to be a blockbuster hit at the box office. Sanju is really a movie with a difference and shouldn't miss it by any chance! Never again can bollywood produce a movie of this magnitute and only comes once in a lifetime.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more