»   » ‘సంజు’ మూవీ ఫస్ట్ రివ్యూ ఔట్: రణబీర్ కపూర్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్!

‘సంజు’ మూవీ ఫస్ట్ రివ్యూ ఔట్: రణబీర్ కపూర్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sanju First Review ‘సంజు’ మూవీ ఫస్ట్ రివ్యూ

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితంలో లెక్కలేనన్ని వివాదాలు, ఎన్నో ఆసక్తికర అంశాలు, దిగ్భ్రాంతికర సంఘటనలు. వాటికి తెరరూపం కల్పంచారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా ఫస్ట్ లుక్ నుండే భారీ అంచనాలు పెంచిన ఈచిత్రం ట్రైలర్ విడుదల తర్వాత ప్రతి ఒక్కరిలోనూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 'సంజు'కు ఏర్పడ్డ క్రేజ్ చూస్తుంటే ఈ చిత్రం విడుదలైన తర్వాత బాలీవుడ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

  శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో బుధవరాం రాత్రి రాజ్ కుమార్ హిరానీ తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన అనంతరం పలువురు తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారి కామెంట్స్ బట్టి చూస్తే సినిమా అదిరిపోయే విధంగా ఉందని స్పష్టమవుతోంది. వారి కామెంట్లపై ఓ లుక్కేద్దాం.

   రిషి దర్దా

  రిషి దర్దా

  ‘సంజు' మూవీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. కమ్లి పాత్రలో విక్కీ కౌశల్, సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ మరిచిపోలేని విధంగా ఉంది. రణబీర్ కపూర్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా మొదలైన 5 నిమిషాలకే సంజయ్ దత్ జీవితంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. రాజ్ కుమార్ హిరానీ ది బెస్ట్ డైరెక్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు అని ట్వీట్ చేశారు.

   మాస్టర్ పీస్

  మాస్టర్ పీస్

  ఒకే సీన్లో నవ్వించడంతో పాటు ఏడిపించే చిత్రం మాస్టర్ పీస్ మూవీ అవుతుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ను మీరు ప్రేమిస్తారు. బోమన్ ఇరానీ పాత్ర మీకు నవ్వు తెప్పిస్తుంది. జిమ్ శరబ్ పాత్రను మీరే హేట్ చేస్తారు. ఇక సినిమా చివర్లో సంజయ్ దత్ రాక్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చినపుడు మీరు విజిల్స్ వేయకుండా ఉండలేరు... అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

   మోహిత్ కాంబోజ్

  మోహిత్ కాంబోజ్

  ఈ సినిమా చూసిన బిజేపీ నేత మోహిత్ కాంబోజ్ రియాక్ట్ అవుతూ.... రాజ్ కుమార్ హిరానీకి బెస్ట్ విషెస్ తెలిపారు. రణబీర్ కపూర్, ఇతర తారాగణం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, సంజయ్ దత్ జీవితాన్ని తెరపై ఎంతో చక్కగా చూపించారు. పరేష్ రావల్ ఆల్ టైమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత సంజయ్ సాబ్ మీద రెస్పెక్ట్ పెరిగింది అని ట్వీట్ చేశారు.

  స్వరూప్

  స్వరూప్

  మిస్ ఇండియా 1979 స్వరూప్ స్పందిస్తూ... రణబీర్ కపూర్, పరేష్ రావల్, విక్కీ కౌశల్ నటనకు మంత్రముగ్ధులమైపోయాము. రాజ్ కుమార్ హిరానీ అద్భుతమైన స్టోరీ టెల్లర్ అని ట్వీట్ చేశారు.

   అభిమన్యు

  అభిమన్యు

  సినిమా డిస్ట్రిబ్యూటర్ అభిమన్యు స్పందిస్తూ... ఇదొక అద్భుతమైన సినిమా, సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ అదరగొట్టారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ ఔట్ స్టాండింగ్ అని ట్వీట్ చేశారు.

  రాజ్ బన్సల్

  రాజ్ బన్సల్

  ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, మల్టీ ప్లెక్స్ ఓనర్ రాజ్ బన్సల్ స్పందిస్తూ.... ‘సంజు మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, హ్యూమన్ రిలేషన్స్ గురించి ఎంతో బాగా చూపుతుంది. మరోసారి రాజ్ కుమార్ హిరానీ తాను ఎక్సలెంట్ ఫిల్మ్ మేకర్ అని నిరూపించారు. రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ ఔట్ స్టాడింగ్. ఇది సూపర్ హిట్ మూవీ అని ట్వీట్ చేశారు.

  బంటీ ఎస్ వాలియా

  బంటీ ఎస్ వాలియా

  హిందీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ బంటీ ఎస్ వాలియా స్పందిస్తూ... ‘అద్భుతమైన సినిమా. రణబీర్ అంటే సంజు... సంజు అంటే రణబీర్ అనేలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఈ సినిమా గురించి మాటల్లో వర్ణించలేక పోతున్నాను. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ సూపర్ అని ట్వీట్ చేశారు.

  టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్

  టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్

  టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ స్పందిస్తూ.... ‘ఇదొక మాస్టర్ పీస్ సినిమా. సింప్లీ ఎక్స్‌ట్రార్డినరీ. రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడు. రాజు సర్... మీరు మరో ఎపిక్ మూవీ క్రియేట్ చేశారు. చిత్ర బృందానకి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

  అలియా భట్ తల్లి స్పందన

  అలియా భట్ తల్లి స్పందన

  బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తల్లి సోనీ రాజ్‌దాన్ ఈ సినిమా చూసిన అనంతరం ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. "ఈ వ్యక్తిని ఆరాధిస్తాను. ఈ ప్రపంచంలో ఉత్తమమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు అని భావిస్తుంటాను. ఆయన పేరుతో ఒక గొప్ప సినిమా నాకు ఆశ్చర్యం అనిపించలేదు. నాకెంతో నచ్చింది... అని ట్వీట్ చేశారు.

   సంజు

  సంజు

  సంజు చిత్రంలో రణబీర్ కపూర్, పరేష్ రావల్, మనీషా కొయిరాలా, బోమన్ ఇరానీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, విక్కీ కౌశల్, కరిష్మా తన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 29న ఈ చిత్రం విడుదలవుతోంది.

  English summary
  There's no doubt that Sanjay Dutt's life story would make up for an interesting watch on the celluloid. To top it, Rajkumar Hirani got one of the most versatile actors from the current lot- Ranbir Kapoor to play him on-screen. Right from the first look to the trailer to the songs, Sanju has been receiving applauds from all nooks and corners. It is quite evident that Ranbir has put his blood and sweat into this project and with the Midas touch of Rajkumar Hirani, this flick is definitely going to hit the ball straight out of the park. While Sanju is slated to hit the theatrical screens, the makers held a private screening from their friends, family and insiders from the industry last night at a suburban studio.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more