For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్ : 100 మంది బాలీవుడ్ సెలబ్రిటీల నగ్న వీడియోలు లీక్.. డబ్బులిచ్చినా వినకుండా లీకులు?

  |

  గత కొద్ది రోజులుగా బాలీవుడ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. ముందుగా శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు రూపొందించి వాటిని ఒక యాప్ ద్వారా ప్రసారం చేశారని ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే ఆ వ్యవహారం ఇంకా కనుమరుగు కాకముందే ఈ ఏకంగా 100 మంది సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు లీక్ అయ్యాయి అని వాటిని చూపి ఒక ముఠా బ్లాక్ మెయిల్ కూడా చేస్తుందని పోలీసులు గుర్తించారు.. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  చాట్ చేసి నమ్మించి

  చాట్ చేసి నమ్మించి

  సాధారణ వ్యక్తులతో సహా డజన్ల కొద్దీ సినిమా మరియు టీవీ నటులను వేధిస్తున్న ఒక ముఠాను ముంబై సైబర్ సెల్ అరెస్టు చేసింది. ఈ అంశానికి ముంబై సైబర్ సెల్ డిసిపి రష్మి కరందికర్ మాట్లాడుతూ, నిందితులు మొదట వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి వ్యక్తులతో స్నేహం చేసేవారని, ఆపై విశ్వాసం పొందిన తర్వాత వారితో న్యూడ్ వీడియో కాల్స్ కూడా చేసేవారని చెప్పారు.

  అయితే ఆ సమయంలో నిందితులు న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేయడం ద్వారా బాధితుల నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేసేవారని ఆమె వెల్లడించారు. డబ్బు తీసుకున్న తర్వాత కూడా, నిందితులు ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ మరియు డార్క్ వెబ్ కు అమ్మడంతో వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర సైట్లలో అప్‌లోడ్ చేసేవారని వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 5 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ కూడా.

  ఐదుగురి గ్యాంగ్

  ఐదుగురి గ్యాంగ్

  ఈ నిందితులు సైబర్ సెల్ ద్వారా పట్టుబడ్డారు, ఈ నిందితులు అందరూ చదువుకున్న వాళ్ళే. వీరిలో ఇద్దరు నిందితులు ఇంజనీర్లు మరియు ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్లు కాగా ఒకరు మైనర్. ఇక వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్‌లు, 12 నకిలీ ఖాతా వివరాలు, 6 నకిలీ ఇమెయిల్ ఐడీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  ఇక ఇప్పటి వరకు ఈ నిందితులు 258 మందిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో బాలీవుడ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పోలీసులు గురించారు. ఇక వీరు కాకుండా టెలివిజన్‌తో సంబంధం ఉన్న చాలా మంది నటులు మరియు నటీమణులు కూడా ఈ సెక్స్‌టార్షన్ రాకెట్‌కు బాధితులుగా మారాని గుతించారు.

  నేపాల్ లో ఖాతా

  నేపాల్ లో ఖాతా

  ఈ దుర్మార్గులు నిందితుల ద్వారా దోచుకున్న డబ్బును డిపాజిట్ చేయడానికి నేపాల్ బ్యాంక్‌లో తమ ఖాతాను తెరిచారు. అయితే ఆ దేశంలో డబ్బు లావాదేవీలకు ఆధారాలు లేవని వారి ఖాతాను వెంటనే స్తంభింపచేయలేమని పోలీసులు అంటున్నారు. అయితే, నిందితులని అరెస్ట్ చేసిన తర్వాత, సైబర్ సెల్ నేపాల్ సెల్ కు ఈ విషయం గురించి తెలియజేసి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు అడిగామని, తద్వారా అన్ని విషయాలు వెల్లడి అవుతాయి అని తెలుస్తోంది. నిజానికి నిందితులు దాదాపు 250 మంది వీడియో క్లిప్‌లను తయారు చేశారని, ఆ డబ్బును ఇండియా మరియు నేపాల్‌లోని బ్యాంకు ఖాతాలలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. వారి బాధితుల్లో కొందరు టీవీ మరియు చిత్ర పరిశ్రమకు చెందిన మోడల్స్ మరియు ప్రముఖులు ఉన్నారని అంటున్నారు. కానీ వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు.

  ఒక్కొకరికి ఒక్కో పని

  ఒక్కొకరికి ఒక్కో పని

  ఈ ముఠాలో ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్ట పాత్ర ఉందని అంటున్నారు. "వారిలో ఇద్దరు సోషల్ మీడియాలో ప్రొఫైల్‌లను ఆపరేట్ చేసారు, అక్కడ వారు మహిళలు మరియు పురుషులతో స్నేహం చేసారు" అని సైబర్ పోలీసు అధికారి చెప్పారు. కాలక్రమేణా, వారు పురుషులతో సెక్స్చాట్ చేయడం మొదలుపెడతారు మరియు వారి అసభ్యకరమైన వీడియోలను పంచుకునేందుకు వారిని ఒప్పిస్తారని పేర్కొన్న్నారు. అయితే ఈ పరస్పర చర్యలన్నీ గోప్యమైనవనే భరోసాతో. నిందితులు వీడియో కాల్‌లు చేస్తారని కానీ టెక్నాలజీని ఉపయోగించి వారు ఈ కాల్స్ ను రికార్డ్ చేస్తారని వెల్లడించారు.

  డబ్బు కోసం బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడానికి క్లిప్‌లు ఉపయోగించబడతాయని అన్నారు. ఇక మరో ఇద్దరు నిందితులు మెసేజింగ్ యాప్‌లో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశారని, అక్కడ వారు వీడియో క్లిప్‌లను కనీసం 80 మందికి విక్రయించారని గుర్తించారు.

  30 లక్షల రూపాయలు కూడా సంపాదన

  30 లక్షల రూపాయలు కూడా సంపాదన

  సైబర్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో 12 ఖాతాలను గుర్తించారు. మహిళలుగా నటిస్తున్న ముఠా సభ్యులు నిర్వహిస్తున్న ఆరు ఇమెయిల్ ఖాతాలతో పాటు. "ఒక మహిళ కాల్ చేస్తున్నట్టు చేస్తూ వారిని ఒప్పించడానికి నిందితులు యాప్‌లు మరియు ఇతర టెక్నాలజీని ఉపయోగించారు" అని ఒక పేర్కొన్నారు. కానీ ఉపయోగించిన టెక్నాలజీ లేదా యాప్‌ల వివరాలను వెంటనే పేర్కొనలేకపోయారట.

  ఇక అసభ్యకరమైన వీడియో క్లిప్‌ల విక్రయ ప్రకటనల ఆన్‌లైన్ పోస్ట్‌లను కూడా పోలీసులు కనుగొన్నారు. "వీడియోల అమ్మకం ద్వారా సుమారు 30 లక్షల రూపాయలు కూడా సంపాదించినట్టు చెబుతున్నారు. నకిలీ గుర్తింపులతో పనిచేసే డిజిటల్ వాలెట్‌ల ద్వారా కొన్ని విక్రయాల ఆదాయాలు మళ్లించబడ్డాయి "అని అధికారి చెప్పారు.

  ఒక ఎఫ్ఐఆర్ జూన్ 5 న నమోదు చేయబడగా అప్పటి నుంచి విచారణ కొనసాగింది. "అపరిచితుల నుండి వీడియో కాల్‌లు, సోషల్ మీడియా సందేశాలు లేదా టెక్స్ట్‌లకు స్పందించవద్దని మేము పౌరులకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము" అని DCP (సైబర్ పోలీస్) రష్మి కరందికర్ అన్నారు . డబ్బు కోసం ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంటే, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయండి. భయంతో ఆ డబ్బు చెల్లించవద్దు, అని ఆమె పేర్కొన్నారు.

  English summary
  Mumbai Police has made a big revelation about sextortion here and according to this revelation, more than 100 Bollywood stars and TV stars were hunted down by the racket.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X