ఆ మెగా హీరో నా ఓల్డ్ ఫ్రెండ్ అంటూ షారుక్ ఖాన్ కామెంట్.. ట్వీట్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోగా షారుక్ నటించిన చివరి సినిమా జీరో. అది 2018లో వచ్చింది. ఇక మళ్ళీ ఆ తర్వాత హీరోగా కనిపించని షారుక్ ఖాన్ నాలుగు సినిమాలలో గెస్ట్ పాత్రలలోనే కనిపించాడు. ఇక ప్రస్తుతం పటాన్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక పఠాన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. అయితే పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న షారుక్ ఖాన్ ఒకవైపు సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ తో ప్రత్యేకంగా చిట్ చాట్ చేస్తున్నాడు.

Shah Rukh Khan about tollywood hero Ram charan friendship

ఇక రీసెంట్ గా ఫ్యాన్స్ తో ముచ్చటించిన షారుఖ్ ఖాన్ ఒక తెలుగు అభిమాని అడిగిన ప్రశ్నకు కూడా చాలా స్వీట్ గా సమాధానం ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మీ అభిప్రాయం ఏమిటో ఒక ముక్కలో చెప్పాలి అని అడగడంతో అందుకు అతను చాలా స్వీట్ గా ఆన్సర్ అయితే ఇచ్చాడు. అతను నా పాత స్నేహితుడు అంటూ అలాగే నా పిల్లలకు కూడా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అని షారుక్ ఒక చిన్న లైన్ లోనే వివరణ ఇచ్చాడు.

షారుక్ ఖాన్ గతంలో కూడా రామ్ చరణ్తో కలుసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే అతని సినిమాల షూట్స్ హైదరాబాద్ లొకేషన్స్ లో జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు తెలుగు హీరోలను ప్రత్యేకంగా కలుసుకున్నాడు. అందులో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఇక మహేష్ బాబుతో కూడా షారుక్ ఖాన్ కు మంచి అనుబంధం ఉంది. ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి అని కూడా కలుసుకున్నారు.

షారుక్ ఖాన్ కు తెలుగులో కూడా అప్పట్లో కొన్ని సినిమాల ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇక తదుపరి సినిమాలను కూడా అతను తెలుగులో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రూపొందుతున్న పఠాన్ సినిమాతో పాటు ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో రాబోయే జవాన్ సినిమా కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల చేయాలి అని షారుక్ ఖాన్ రెడీ అయ్యాడు. మరి ఆ సినిమాలతో అతనికి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X