Just In
Don't Miss!
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫుట్‌బాల్ మాంత్రికుడా! నీకు కన్నీటి వీడ్కోలు.. తీవ్ర దిగ్బ్రాంతిలో బాలీవుడ్ ప్రముఖులు
ఫుట్‌బాల్ మాంత్రికుడు, దిగ్గజ క్రీడాకారుడు డిగో మారడోనా ఆకస్మిక మరణం ప్రపంచ క్రీడాలోకాన్ని విషాదంలో ముంచెత్తింది. కోట్లాది మంది క్రీడాకారులు మారడోనా మరణ వార్త విని కన్నీటి పర్యంతమయ్యారు. పుట్‌బాల్ క్రీడా జగతికి ఆయన అందించిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకొంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. మారడోనా మృతిపై బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ..

అర్జెంటీనాలో పుట్టి దిగ్గజ క్రీడాకారుడిగా
అర్జెంటినాకు చెందిన డిగో మారడోనా 1960 అక్టోబర్ 30 తేదీన బ్రూనోస్ ఎయిరెస్‌లో జన్మించారు. తన 16వ ఏట అర్జెంటినాకు చెందిన ఫస్ట్ డివిజన్ సాకర్ క్లబ్ ద్వారా ఫుట్‌బాల్ క్రీడా రంగంలోకి అడుగుపెట్టారు. 1986లో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ సాధించడం ద్వారా ఇంగ్లాండ్ జట్టును 2-1 తేడాతో మట్టికరిపించాడు. ఆ తర్వాత జర్మనీపై ఫైనల్‌లో అర్జెంటీనా విజయం సాధించడంలో డిగో మారడోనా కీలకంగా వ్యవహరించారు.

బ్రెయిన్ సర్జరీ తర్వాత
గత రెండు దశాబ్దాలుగా అనేక ఆరోగ్య సమస్యలతో మారడోనా సతమతమవుతున్నారు. ఇటీవల మెదడులో రక్తం గడ్డకట్టడంతో వాటిని తొలగించేందుకు సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత కోలుకొంటున్నారని భావిస్తున్న సమయంలో అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో మరణించడం యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.

షారుక్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి
డిగో మారడోనా మృతిపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్పందిస్తూ.. డిగో మారడోనా.. నీవు ఫుట్‌బాల్ క్రీడను మరింత అందంగా మార్చావు. మీరు మా నుంచి దూరం కావడం చాలా బాధగా ఉంది. నీ ఆటతో ఈ లోకంలోని క్రీడాభిమానులకు వినోదం, అద్బుతాలాను పంచినట్టుగానే స్వర్గలోకంలో కూడా నీ ప్రతిభను చాటుకొంటావని కోరుకొంటున్నాను అని తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

రణ్‌వీర్ సింగ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో
అలాగే డిగో మారడోనాకు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా శ్రద్దాంజలి ఘటించారు. తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ట్రోఫిని ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను షేర్ చేసి సంతాపం తెలిపారు. డిగో మారడోనా నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ అంటూ సందేశాన్ని పెట్టారు.

మారడోనాతో కరీనా కపూర్
డిగో మారడోనా మృతిపై బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలో తనను కలుసుకోవడం గర్వంగా ఉంది. లెజెండ్‌ను కలవడం గొప్ప గౌరవం. నీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ డిగో మారడోనాకు నివాళి అర్పించారు. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా మారడోనాకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.