షారుక్ చేతికి కమల్ హాసన్ సినిమా.. 18 ఏళ్ల తర్వాత రీమేక్

By Rajababu

2000 సంవత్సరంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ తెరకెక్కించిన హే రామ్ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌ సాకేతరామన్ అయ్యంగార్‌గా, అతడి స్నేహితుడిగా అమ్జద్ అలీ ఖాన్ పాత్రలో షారుక్ ఖాన్ నటించాడు. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత హే రామ్ చిత్రాన్ని షారుక్ ఖాన్ రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. హే రామ్ హక్కులను షారుక్ సొంతం చేసుకొన్నాడని ఇటీవల కమల్ హాసన్ కూడా ధ్రువీకరించారు.

హే రామ్ సినిమాలో నటించినందుకు గాను షారుక్‌కు వాచీ బహుకరించాను. అప్పట్లో ఆయనకు ఇవ్వడానికి నా వద్ద అంతకు మించి ఏమీ లేదు. అదే గడియారం కంపెనీకి షారుక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది అని కమల్ తెలిపారు.

Shah Rukh Khan to remake Kamal Haasans Hey Ram

షారుక్ ఖాన్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ రూపొందిస్తున్న జీరో చిత్రం చేస్తున్నాడు. ఇందులో మ‌రుగుజ్జుగా క‌నిపించ‌నున్నాడు బాలీవుడ్ బాద్షా. ప్రఖ్యాత హాలీవుడ్ డైరక్టర్ క్రిస్టోఫర్ నోలన్‌ను హే రామ్ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ఫార్మాట్‌ను చూడమని క‌మ‌ల్ ఇటీవ‌ల‌ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని షారుక్; భరత్ షా సంయుక్తంగా రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X