ప్రముఖ దర్శకుడిపై మాజీ భార్య కేసు.. చిచ్చు పెట్టిన సీనియర్ నటుడు

ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌పై తన మాజీ భార్య, బాలీవుడ్ నటి సుచిత్ర కృష్ణమూర్తి ఆస్తి వివాదంపై కేసు నమోదం చేయడం వివాదంగా మారింది. కొన్నేళ్ల క్రితం తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన స్టార్ సెలబ్రిటీలు తాజాగా వివాదంతో కోర్టుకెక్కడం చర్చనీయాంశమైంది. ఓ ఆస్థి విషయంలో ఆమె కోర్టుకు వెళ్లడంతో ఈ వార్త మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ఆస్థి వివాదం ఏమిటంటే..

కూతురు ఆస్థి దుర్వినియోగం

కూతురు ఆస్థి దుర్వినియోగం

తన కూతురుకు సంబంధించిన ఆస్థి దుర్వినియోగం అవుతుందని యాక్టర్ సుచిత్ర కృష్ణమూర్తి గతవారం కోర్టులో కన్నీటి పర్యంతమైంది. తన కూతురు కావేరికి సంబంధించిన భవనాన్ని సీనియర్ నటుడు కబీర్ బేడీ వాడుకొంటున్నారని ఆరోపిస్తూ ఆమె కోర్టులో ఫిర్యాదు చేశారు.

కోర్టులోనే తేల్చుకొంటాం

కోర్టులోనే తేల్చుకొంటాం

ఆస్తి తగాదా విషయంలో శేఖర్ కపూర్‌తో సంప్రదింపుల జరిపితే జరిగేది ఏమీలేదనే విషయాన్ని ఆమె సన్నిహితులు మీడియాకు వివరించారు. అందుకే ఆయనతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈ విషయంలో తన కూతురికి న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతానని ఆమె అన్నారు. తాజాగా కేసు దాఖలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తున్నది.

కబీర్ బేడి ఖండన

కబీర్ బేడి ఖండన

అక్రమంగా తన భవనం, దానికి సంబంధించిన స్థలంలో ఉంటున్నారనే సుచిత్రా చేసిన ఆరోపణలను నటుడు కబీర్ బేడి ఖండించారు. లీగల్‌గా ఒప్పందం చేసుకొనే తాను ఆ స్థలంలో ఉన్నానని, దానికి సంబంధించిన పక్కా అగ్రిమెంట్లు తన వద్ద ఉన్నాయని కబీర్ బేడీ ఈ వివాదంపై స్పందించారు.

 న్యాయపోరాటమే చేస్తా

న్యాయపోరాటమే చేస్తా

శేఖర్ కపూర్, కబీర్ బేడిపై న్యాయం పోరాటం చేస్తాను. ఈ వివాదంపై మీడియాలో రచ్చ చేయడం నాకు ఇష్టం లేదు. మాకు చెందాల్సిన హక్కుల కోసం తన కూతురి కోసం పోరాటం చేస్తానని అన్నారు. గత మూడేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని, ఎన్ని రోజులైనా కోర్టులోనే తేల్చుకొంటానని ఆమె తెలిపారు.

Recommended Video

Screenplay Movie Public Talk | Vikram Shiva | Pragathi Yadhati | Filmibeat Telugu
ప్రేమించి పెళ్లి చేసుకొని.. విడాకులతో..

ప్రేమించి పెళ్లి చేసుకొని.. విడాకులతో..

సుచిత్రా కృష్ణమూర్తి విషయానికి వస్తే.. నటిగా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. షారుక్ ఖాన్‌తో కలిసి కబీ హా కబీ నా చిత్రంలోను. ఆగ్, విశ్వ, రన్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి 1997లో పెళ్లి చేసుకొన్నారు. అభిప్రాయ బేధాలు తలెత్తడంతో సెప్టెంబర్ 2006లో వారిద్దరూ విడిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X