నా మొదటి భార్యకు ఆమె బావతో అక్రమ సంబంధం.. ఆ మోసానికి గుండె పగిలింది.. శిల్పాశెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వివాహం విషయం మరోసారి మీడియాలో వివాదంగా మారింది. రాజ్ కుంద్రా మొదటి భార్య కవిత తన కాపురం చెడిపోవడానికి శిల్పాశెట్టి కారణం అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇటీవల తెరపైకి రావడం మీడియాలో హల్‌చల్ రేపింది. తనపై శిల్పాశెట్టిపై చేసిన ఆరోపణలకు మరోసారి దాదాపు 12 ఏళ్ల తర్వాత రాజ్ కుంద్రా మౌనం వీడారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో...

కవితకు విడాకులు.. శిల్పాశెట్టితో పెళ్లి
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా 2006లో తన మొదటి భార్య కవితకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకొన్నారు. అయితే తనపై విమర్శలు చేసి కవితపై ఆ సమయంలో శిల్పాశెట్టి ఘాటుగా స్పందించారు. రాజ్ కుంద్రాను కవిత విడిచి చాలా ఏళ్లు వెళ్లిపోవడం జరిగింది. తిరిగా రాకపోయే సరికి నన్ను రాజ్ కుంద్రా వివాహం చేసుకొన్నారు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తన పెళ్లి సమయంలో శిల్పాశెట్టి వెల్లడించారు.

నాపై కట్టుకథలు రాయిస్తున్నారు...
తన మొదటి భార్యపై రాజ్ కుంద్రా ఘాటుగా స్పందిస్తూ.. లండన్‌లో ఉంటున్న కవిత.. పలు మీడియా కంపెనీలకు డబ్బు వెదజల్లి నాకు, శిల్పాశెట్టికి వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారు. మా ప్రతిష్టను దిగజార్చేందుకు, ప్రశాంతంగా బతుకుతున్న మా కాపురంలో అనిశ్చితి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు అని రాజ్ కుంద్రా ఆరోపించారు.

నా భార్యకు అతడితో అక్రమ సంబంధం
కవితతో నా వైవాహిక జీవితం విఫలం కావడంపై రాజ్ కుంద్ర వివరణ ఇచ్చారు. ఆ సమయంలో మేము లండన్‌లో ఉండగ నా భార్య కవితకు తన సోదరి భర్తతో అక్రమ సంబంధం ఉండేది. నా తోడల్లుడితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. నేను బిజినెస్ ట్రిప్స్ మీద బయటకు వెళ్లినప్పుడు వారిద్దరి కలిసి ఉండేవారు. అయితే నాకు అనుమానం వచ్చినా... నేను అలా జరగదని అనుకొన్నాను అని రాజ్ కుంద్రా తెలిపారు.

గుట్టు రట్టు చేసిన కారు డ్రైవర్
కానీ నా భార్య తీరుతో ఆ తర్వాత వారిద్దరి వ్యవహారం బయటపడింది. నా ఫ్యామిలీ, నా కారు డ్రైవర్ కూడా వారిద్దరి రిలేషన్ గుట్టును బయటపెట్టారు. దాంతో మా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. నా భార్యతో అఫైర్ విషయం బయటపడిన తర్వాత కవిత సోదరి, ఆమె భర్త ఇండియాకు వచ్చేశారు అని రాజ్ కుంద్రా వెల్లడించారు.

ఆమె చేసిన మోసానికి గుండె పగిలింది..
నా భార్య నాకు చేసిన మోసానికి గుండె పగిలిపోయినంత పనైంది. ఆమె చేసిన మోసాన్ని తెలుసుకొని చాలా సార్లు భోరున ఏడ్చాను. ఆమె నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని అనుకొన్నాను. ఓ రోజు ఆమె అక్రమ సంబంధం విషయంపై వాదనలు జరిగిన తర్వాత కవితను ఆమె తల్లిదండ్రుల ఇంట్లో విడిచి వచ్చాను. ఆ సమయంలో కవిత ద్వారా పుట్టి బిడ్డకు 40 రోజలు వయసు. ఆ నాటితో మా బంధం ముగిసింది అని రాజ్ కుంద్రా తెలిపారు.


Click it and Unblock the Notifications











