For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra అరెస్ట్ తర్వాత అడుగు బయటపెట్టిన శిల్ప.. ఊహించని రెస్పాన్స్ తో కన్నీళ్లు?

  |

  జూలై 19 న అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత శిల్పా శెట్టి తాను జడ్జ్ గా వ్యవహరిస్తున్న డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ 4 కి హాజరు కాలేదు. ఆమె ఈ టెన్షన్ కారణంగా విరామం తీసుకుంది. ఈ క్రమంలో షోలో శిల్పా శెట్టి స్థానంలో, అనేక ఇతర ప్రముఖులు వచ్చి ఆమె లేని లోటును పూరించారు. ఇప్పుడు శిల్పా శెట్టి 3 వారాల తర్వాత సూపర్ డాన్సర్ 4 సెట్స్‌కి తిరిగి వచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ వర్గాల నివేదికల ప్రకారం ఈ షో 2016 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుండి, శిల్పా శెట్టి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇలాంటి పెద్ద విషయం జరిగినా ఆమెను తప్పించకుండా మేకర్స్ శిల్పా తిరిగి షో కోసం ఎదురు చూస్తున్నారు మరియు ఆమె స్థానంలో ఇతర ప్రముఖులు రావాలని వారు కోరుకోలేదు. శిల్పా తిరిగి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉందని సీజన్ ముగిసే వరకు ఆమె ఈ షోలో ఉంటుందని ఆశిస్తున్నామని మేకర్స్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది'.

  తన భర్త పోర్న్ కేసులో చిక్కుకున్న మూడు వారాల తర్వాత శిల్పా తిరిగి ప్రదర్శనకు వెళ్లాలని నిర్ణయించుకుంది, దీని కోసం ఆమె చాలా ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక ఆమె షోకి తిరిగి వచ్చినందుకు మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఇకపై శిల్పా శెట్టికి ప్రత్యామ్నాయం కనుగొనవలసిన పని ఉండదు. ఇక శిల్పా తన పిల్లలు మరియు కుటుంబం కోసం మాత్రమే కాకుండా తన స్వస్థత కోసం కూడా తిరిగి పని చేయాలనుకుంటుందని అంటున్నారు. ఇక మూడు వారల తరువాత వచ్చిన ఆమెకు సూపర్ డాన్సర్ బృందం ఆప్యాయంగా స్వాగతించింది, ఇక అలా చేయడం ఈ ఉదయం ఆమెను చాలా భావోద్వేగానికి గురి చేసింది, "అని అంటున్నారు. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో, ఆమె సహ-న్యాయమూర్తి అనురాగ్ బసు శిల్ప గైర్హాజరు గురించి మాట్లాడుతూ మా టీమ్ ఆమెను తీవ్రంగా మిస్ అవుతున్నామని చెప్పారు.

  Shilpa Shetty resumes her work with Super Dancer 4 after Raj Kundra Pornography Case

  "మేము శిల్పను సెట్‌లో చాలా మిస్ అవుతున్నాం, షోలో భాగమైన మా అందరి మధ్య మంచి బంధం ఉంది, మరియు ఇందులో తెర వెనుక ఉన్న వ్యక్తులు మరియు కొరియోగ్రాఫర్లు కూడా ఉన్నారని అన్నారు. ఇక మేము ఒక చిన్న కుటుంబంలా ఉండేవారమని పేర్కోన్నారు. ఇక శిల్పతో సహా అనురాగ్ బసు మరియు గీతా కపూర్‌ ఈ షోకు న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. శిల్పా శెట్టి లేనప్పుడు ఈ మూడు వారాల పాటు సంగీత బిజ్లానీ, జాకీ ష్రాఫ్, టెరెన్స్ లూయిస్, సోనాలి బింద్రే, మౌషుమి ఛటర్జీ, కరిష్మా కపూర్, జెనీలియా దంపతులు అతిథులుగా వచ్చారు. సూపర్ డాన్సర్ 4 యొక్క తదుపరి ఎపిసోడ్‌లో, ఇండియన్ ఐడల్ విజేత సహా ఫైనలిస్టులు ప్రత్యేకంగా కనిపిస్తారని అంటున్నారు. ఇండియన్ ఐడల్ 12 విజేత పవణ్‌దీప్ రాజన్ మరియు ఇతర ఫైనలిస్టులు - అరుణిత కంజిలాల్, సాయిలీ కాంబ్లే, మొహమ్మద్ డానిష్, నిహాల్ టౌరో మరియు షణ్ముఖప్రియ కూడా ఇందులో భాగం కానున్నారు. ఇక ప్రస్తుతం, అశ్లీల కేసులో రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చిన తర్వాత, శిల్పా శెట్టిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయితే రాజ్ కుంద్రా కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పా శెట్టి ఒక ప్రకటనలో తెలిపింది.

  English summary
  Shilpa Shetty resumes her work with Super Dancer 4 after Raj Kundra Pornography Case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X