Raj Kundra పోర్న్ వ్యవహారం మీద నోరు విప్పిన శిల్ప.., అంతా ఆయనే చేశాడు, నాకు సంబంధం లేదు!
వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, అతని ఐటి చీఫ్ ర్యాన్ తోర్పే జూలై 27 వరకు పోలీసు కస్టడీలో ఉంటారని ముంబైలోని మేజిస్ట్రేట్ శుక్రవారం తీర్పునిచ్చారు. అయితే ఈ విషయంలో శిల్పా శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

నాకేం తెలియదు
ఇక జుహులోని నటి శిల్పా శెట్టి నివాసంలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. అందుతున్న సమాచారం ప్రకారం, శిల్పా శెట్టి భర్త అశ్లీల కంటెంట్ తయారుచేసే కార్యకలాపాలలో పాల్గొన్నట్లు ఆమెకు తెలుసా అని పోలీసులు అడిగారు. దానికి ఆమె లేదని సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు.

మా ఆయన నిర్దోషి
అంతే కాక ఈ పోర్న్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించారని కూడా పోలీసులు భావిస్తున్నారు. డబ్బు లావాదేవీలపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని అంటున్నారు. అయితే తన భర్త రాజ్ కుంద్రా నిర్దోషి అని శిల్పా క్రైమ్ బ్రాంచ్ కి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. హాట్‌షాట్స్ యాప్‌లోని కంటెంట్‌కు సంబంధించి, శిల్ప తనకు దాని గురించి ఏమీ తెలియదని పేర్కొన్నట్టు చెబుతున్నారు.

నాకేం సంబంధం లేదు
అసలు తనకు హాట్‌షాట్‌తో సంబంధం లేదని, తన భర్త రాజ్ కుంద్రా ఎలాంటి పోర్న్‌కంటెంట్ ప్రొడక్షన్ లో పాల్గొనలేదని చెప్పారు. ఎరోటికాకి పోర్న్ కి చాలా తేడా ఉందని పేర్కొన్న ఆమె తన భర్త రాజ్ కుంద్రా పోర్న్ మెటీరియల్ తయారీలో పాల్గొనలేదని ఆమె చెప్పారు.

బక్షిదే అంతా
ఇక లండన్ కు చెందిన వాంటెడ్ నిందితుడు, రాజ్ కుంద్రా యొక్క బావ ప్రదీప్ బక్షి ఈ యాప్ మరియు దాని పనితో సంబంధం కలిగి ఉన్నారని శిల్పా శెట్టి చెప్పినట్టు తెలుస్తోంది. ఇక అశ్లీల చిత్రాల నిర్మాణంలో, మొబైల్ యాప్‌ల ద్వారా ప్రసారం చేసినందుకు కుంద్రాతో పాటు ముంబై పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు.

ఒప్పందం
ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. మొబైల్ యాప్స్ ద్వారా అశ్లీల విషయాలను ప్రసారం చేయడంలో సంబంధం ఉన్న కుంద్రా లండన్‌కు చెందిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సినిమా రిలీజ్
ఇక శిల్పా శెట్టి నటించిన హంగామా -2 నిన్న శుక్రవారం విడుదలైంది. శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హంగామా 2 పోస్టర్‌ను షేర్ చేసింది, అలాగే ఒక సందేశంలో రాసింది. హంగమా 2 ని ఖచ్చితంగా చూడాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏమి జరుగుతుందో అది సినిమాను ప్రభావితం చేయకూడదని ఆమె తన పోస్ట్‌లో రాశారు. ఈ కేసులో ముంబై పోలీసులు శుక్రవారం శిల్ప శెట్టి వాంగ్మూలం నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











