శ్రీదేవి చిన్న కూతురి కోసం కరణ్ జోహార్ మాస్టర్ ప్లాన్.. తెలుగులోనే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా ఎంతగానో గుర్తింపు అందుకున్న శ్రీదేవిని ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. అందంతో పాటు నటనలో కూడా ఎంతగానో ఆకట్టుకున్న ఆమె మరణించే ముందు వరకు కూడా ప్రేక్షకులను నిరాశ పరచలేదు. ప్రతి సినిమాలో ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూనే ఉన్నారు. ఇక ఆమె సమక్షంలోనే కూతురు జాన్వీ కపూర్ గ్రాండ్ గా కెమెరా ముందు లాంచ్ అయిన విషయం తెలిసిందే.
కానీ బిగ్ స్క్రీన్ పై చూసే అదృష్టం ఆమెకు కలగలేదు. ఇక జాన్వీ మొదటి సినిమా అంతగా ఆడకపోయినా కూడా రెండవ సినిమాతో మంచి నటిగా గుర్తింపు అందుకుంది. గుంజన్ సక్సెనా బయోపిక్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక కరణ్ జోహార్, ఖుషి కపూర్ ను కూడా గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం బైలాంగ్యువల్ కథను రెడీ చేసినట్లు సమాచారం.

ఖుషి కపూర్ ఇప్పటికే యాక్టింగ్ కోర్సు పూర్తి చేసుకుంది. ఇక కరణ్ జోహార్ పూర్తి స్థాయిలో కాకుండా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ద్వారా ఖుషి కపూర్ మొదటి సినిమాను నిర్మించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. బోణి కపూర్ కూడా దిల్ రాజు పాట్నర్ గా ఉండబోతున్నట్లు టాక్ వస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అందించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఖుషి కపూర్ మొదటి సినిమా ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











