Don't Miss!
- Sports
INDvsAUS : మరో ఆటగాడికి గాయం.. ఆ దేవుడే కాపాడాలంటూ.. ఆసీస్‌పై జాలి చూపిస్తున్న ఫ్యాన్స్!
- News
టీడీపీలో చేరొచ్చుగా- పవన్‌ను సూటిగా ప్రశ్నించిన బాలయ్య: సీఎం అయిన తరువాతే చనిపోతా..!!
- Lifestyle
క్యాన్సర్ చికిత్స తర్వాత శృంగార కోరికలు తగ్గుతాయా? సరిగ్గా సెక్స్ చేయలేరా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Shahrukh Khan Pathaan సెన్సార్ పై తెలుగు నటి ఆగ్రహం.. దారుణం అంటూ శ్రేయా ట్వీట్!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనదైన యాక్టింగ్, డ్యాన్స్ నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ పఠాన్.
ఈ సినిమాకు మొదటి నుంచి సూపర్ హైప్ వచ్చినప్పటికీ బేషరమ్ రంగ్ సాంగ్ తో వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఇటీవల పఠాన్ సినిమాకు సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్లను తొలగించింది. ఈ విషయంపై తెలుగు నటి శ్రేయా ధన్వంతరి ఫైర్ అయింది.

జనవరి 25న గ్రాండ్ రిలీజ్..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హాట్ బ్యూటి దీపిక పదుకొణె మరోసారి జంటగా నటించిన చిత్రం పఠాన్. యాక్షన్ చిత్రాలుక పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో మెరవనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఒక్క పాటతో వివాదం..
చాలా కాలం గ్యాప్ అంటే దాదాపుగా మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే పఠాన్ షూటింగ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ బేషరమ్ రంగ్ పాటను డిసెంబర్ 12వ విడుదల చేసిన విషయం తెలిసిందే. షారుక్, దీపికల హాట్ నెస్ తో బేషరమ్ రంగ్ సాంగ్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంతే విమర్శల పాలయింది.

సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్..
ఇందులో దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీ ధరించడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రాతోపాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే సినిమాను విడుదల చేయడం ఆపాలని డిమాండ్ కూడా చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలోని బేషరమ్ సాంగ్ లో అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 200 నగరాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

12 సీన్లకు కత్తెర..
ఇక ఇటీవల సెన్సార్ బోర్డ్ కు వెళ్లి పఠాన్ కు బీభత్సమైన కోతకు గురైంది. అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించింది. మొత్తంగా పఠాన్ సినిమాలో 12 సన్నివేశాలను తొలగించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది.
అంతేకాకుండా బేషరమ్ రంగ్ సాంగ్ లో దీపిక పదుకొణెపై చిత్రీకరించి క్లోజప్ షాట్స్ కు కూడా కత్తెర పడింది. ఈ విషయంపై తాజాగా హైదరాబాద్ బ్యూటి శ్రేయా ధన్వంతరి సీరియస్ అయింది.

ఏది చూడాలో ప్రేక్షకులను నిర్ణయించుకోని..
"ఇది చాలా దారుణం. నిజంగా దారుణం. అద్భుతమైన ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో అది నిర్ణయించుకునే పవర్ వాళ్లకు ఇవ్వండి. వాళ్లకు ఏదైనా నచ్చకుంటే.. టికెట్ కొనకుండా వాళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అదే వారిని చేయనివ్వండి. కానీ, ఇది ఏంటిది. ఈ సెన్సార్ షిప్ ఏంటీ. ఇలాంటి సెన్సార్ షిప్ తో ఇదివరకే విసిగిపోయాం" అని శ్రేయా ధన్వంతరి ట్విటర్ లో రాసుకొచ్చింది.
|
జోష్ సినిమాలో నాగ చైతన్యతో..
కాగా ఇటీవలే చుప్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రేయా ధన్వంతరి.. నాగ చైతన్య నటించిన తొలి చిత్రం జోష్ సినిమాలో నటించింది. ఇందులో నాగ చైతన్యకు ఫ్రెండ్ గా ఆకట్టుకుంది. అలాగే సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇక హిందీలో స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ హైదరాబాద్ బ్యూటి.