Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- News
అన్నెం సాయిపై మరో కేసు నమోదు..
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Salman Khan ఇంట్లో మరో బ్రేకప్.. 24 ఏళ్ల దాంపత్య జీవితానికి దంపతుల గుడ్‌బై
సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ తన భార్య సీమా ఖాన్ తో విడాకులు తీసుకోనున్నారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం ఫ్యామిలీ కోర్టు బయట సోహైల్, సీమా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా కోర్టు నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇద్దరూ పెళ్లి బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

24 ఏళ్ల తరువాత
ఎంతో అన్యోనంగా ఉండే సోహైల్ ఖాన్- సీమా ఖాన్‌లు పెళ్లయిన 24ఏళ్ల అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. సీమా ఖాన్ అసలు పేరు సీమా సచ్‌దేవ్. ఆమె వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అలాగే స్టైలిస్ట్. కల్లిస్టా పేరుతో సీమ సొంతంగా సెలూన్ కూడా నడుపుతున్నారు. సుస్సానే ఖాన్, మహీప్ కపూర్‌లతో కలిసి ముంబైలోని బాంద్రాలో 190 లగ్జరీ బోటిక్‌లను నడుపుతున్నారు.

సినీ ఫక్కీలో
సోహైల్ ఖాన్ - సీమా సచ్‌దేవ్‌ల ప్రేమకథ చదివితే, మీకు ఏదైనా సినిమా గుర్తుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. 1998లో సోహైల్ ఖాన్- సీమా ఖాన్‌లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి నిర్వాన్, యోహాన్ అనే పిల్లలుగా ఉన్నారు. ఖాన్ కుటుంబానికి చెందిన సోహైల్ ఖాన్, సీమతో ప్రేమలో పడ్డప్పుడు, అర్ధరాత్రి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఎంగేజ్‌మెంట్ పార్టీలో
చుంకీ
పాండే
ఎంగేజ్‌మెంట్
పార్టీలో
సీమా,
సోహైల్
తొలిసారి
కలిశారని
చెబుతున్నారు.
పార్టీలో
ఇద్దరి
మధ్య
స్నేహం
చిగురించడంతో
ఇక్కడ
నుంచే
ఇద్దరి
మధ్య
ప్రేమ
చిగురించింది.
ఆ
తర్వాత
ఇద్దరూ
డేటింగ్
చేయడం
మొదలుపెట్టారు.సీమా
సచ్‌దేవ్
ఢిల్లీ
నివాసి.
ఫ్యాషన్
రంగంలో
తన
అదృష్టాన్ని
పరీక్షించుకునేందుకు
ఢిల్లీ
నుంచి
ముంబైకి
వచ్చింది.
నేడు
ఆమె
ప్రముఖ
ఫ్యాషన్
డిజైనర్
-
స్టైలిస్ట్.

ఇద్దరు పిల్లలు
చంకీ
పాండే
-
సీమా
సచ్‌దేవ్
బంధువులు.
ముంబైలో
చుంకీ
పాండే
నిశ్చితార్థంలో
సోహైల్
-
సీమా
కలుసుకోవడానికి
ఇదే
కారణం.
హైల్
ఖాన్
-
సీమా
సచ్‌దేవ్
15
మార్చి
1998న
వివాహం
చేసుకున్నారు.
వారిద్దరూ
మొదట
ముస్లిం
సంప్రదాయంలో,
ఆపై
ఆర్యసమాజ్
ఆలయంలో
హిందూ
సంప్రదాయం
ప్రకారం
వివాహం
చేసుకున్నారు.
సోహైల్,
సీమా
దంపతులకు
నిర్వాన్
మరియు
యోహాన్
అనే
ఇద్దరు
పిల్లలు
ఉన్నారు.

హఠాత్తుగా విడిపోవాలని
అందుతున్న సమాచారం ప్రకారం, సోహైల్ ఖాన్, సీమా సచ్‌దేవ్ శుక్రవారం ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ అలాగే ఉందని అంటున్నారు. ఇద్దరూ హఠాత్తుగా విడిపోవాలని నిర్ణయించుకున్నారని, దీని గురించి ఎవరికీ చెప్పలేదని అంటున్నారు.

సల్మాన్ కుటుంబంలో
ఇద్దరూ
తమ
నిర్ణయాన్ని
గోప్యంగా
ఉంచడం
సరైనదని
భావించి,
ఆపై
విడాకుల
కోసం
దరఖాస్తు
చేసుకున్నారు.
వీరు
గత
కొన్నేళ్లుగా
దూరం
దూరంగానే
జీవిస్తున్నారని
అంటున్నారు.
సీమా,
సోహైల్
మధ్య
ఎలాంటి
వివాదాలు
లేవని
దంపతుల
సన్నిహితులు
తెలిపారు.
ఇద్దరూ
కలిసి
ఈ
నిర్ణయం
తీసుకున్నారు,
వారి
వారి
జీవితంలో
ముందుకు
సాగాలని
నిర్ణయించుకున్నారు.
సల్మాన్
ఖాన్
కుటుంబానికి
ఇది
రెండో
విడాకులు.
గతంలో
అర్బాజ్
ఖాన్,
మలైకా
అరోరా
కూడా
విడిపోయారు.