»   » జాహ్నవికి సారీ చెప్పిన సోనమ్ కపూర్.... పెళ్లి వేడుకలో ఆసక్తికర సంఘటన!

జాహ్నవికి సారీ చెప్పిన సోనమ్ కపూర్.... పెళ్లి వేడుకలో ఆసక్తికర సంఘటన!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sonam Kapoor Mehandi Function Highlights

  బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వివాహం ఆనంద్ ఆహుజాతో నేడు (మే 8) వైభవంగా జరుగబోతోంది. పెళ్లి వేడుక కంటే ముందు మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు కపూర్ ఫ్యామిలీతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరైన సందడి చేశారు. మెహందీ వేడుక సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెళ్లి కూతురు సోమన్ కపూర్.... తన సోదరి జాహ్నవి కపూర్‌కు సారీ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  సిక్కు సాంప్రదాయం ప్రకారం సోనమ్ కపూర్ పెళ్లి వేడుక

  సిక్కు సాంప్రదాయం ప్రకారం సోనమ్ కపూర్ పెళ్లి వేడుక జరుగుతోంది. ఇందులో భాగంగా మెహందీ వేడుకలో పెళ్లి కూతురు ఛుదా (ఎర్రని గాజులు) ధరించి, గాజులతో పాటు కలేరి (సాంప్రదాయ వస్తువు)ని ఇతర అమ్మాయికి తాకించే ప్రయత్నం చేస్తారు. అలా ఎవరికైతే తాకిస్తారో త్వరలోనే వారి వివాహం జరుగుతుందని సిక్కుల నమ్మకం.

  జాహ్నవికి సారీ చెప్పిన సోనమ్

  నా తర్వాత పెళ్లి కూతురు కాబోయేది నువ్వే అంటూ తన సోదరి జాహ్నవి కపూర్‌కు కలేరీని తాకించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆటపట్టించింది సోనమ్ కపూర్. దీంతో జాహ్నవి కంగారు పడింది. అయితే సోనమ్ అలాంటిదేమీ చేయక పోవడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో జాహ్నవికి సోనమ్ సారీ చెప్పడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  సోనమ్ పెళ్లి వేడుకలో కత్రినా

  సోనమ్ పెళ్లి వేడుకలో కత్రినా

  సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్

  జాహ్నవి, ఖుషి

  జాహ్నవి, ఖుషి

  తమ సోదరి సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్.

  ప్రముఖ నటి రేఖ

  ప్రముఖ నటి రేఖ

  కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పిల్లలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ప్రముఖ నటి రేఖ.

  కొడుకుతో కలిసి బోనీ

  కొడుకుతో కలిసి బోనీ

  తన కుమారుడు అర్జున్ కపూర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన బోనీ కపూర్.

  ఇసబెల్లే కైఫ్

  ఇసబెల్లే కైఫ్

  సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరి ఇసబెల్లే కైఫ్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆమె హాట్ లుక్ తో ఆకట్టుకున్నారు.

  అచ్చం శ్రీదేవిని చూసినట్లే

  అచ్చం శ్రీదేవిని చూసినట్లే

  ఈ ఫోటోలో జాహ్నవిని చూసిన అభిమానులు అచ్చం శ్రీదేవిని చూసినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  కరణ్, సోనమ్

  కరణ్, సోనమ్

  ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి పెళ్లి కూతురు సోనమ్ కపూర్.

  సందడే సందడి

  సందడే సందడి

  బాలీవుడ్ లోని ప్రముఖ స్టార్స్ అంతా సోనమ్ కపూర్ పెళ్లి వేడుకకు హాజరైన సందడి చేశారు.

  English summary
  he much awaited wedding of the year is finally happening and we have been keeping you updated with the pictures from the 'mehendi' ceremony of Sonam Kapoor that took place at BKC in Mumbai. Of the many videos from inside the blockbuster mehendi, there's one of Janhvi and Sonam that's gone crazy viral and is doing the rounds on the Internet. From the inside moments on social media, it the mehendi ceremony, Sonam was made to wear chudha (red bangles traditionally worn by the bride) and kaleere (danglers attached to the chudhas) as is ritual. And in the video, Sonam can be seen trying to drop the kaleere on Janhvi's head. As per tradition, it is believed that next in line for wedding is the person on whose head the bride's kaleere falls.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more