నా లక్ష్యం ఒక్కటే.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్
వెండితెరపై సోనూ సూద్ ఒక విలన్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అటు బాలీవుడ్ లోనే కాకవుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా క్రేజ్ అందుకున్నాడు. అయితే ఈ నాలుగు నెలల కాలంలోనే అతనికున్న క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. సినిమా విలన్ ని ఒక హీరోలా దేశంలోని జనాలు ఆకాశానికి ఎత్తేశారు. అయితే సడన్ గా అతనిపై పొలిటికల్ కామెంట్స్ రావడం వైరల్ గా మారింది. ఈ విషయంపై ఎట్టకేలకు సోనూ సూద్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

బస్సులను ఏర్పాటు చేసి
యాక్టర్ సోనూ సూద్ గతంలో ఎప్పుడు లేని విదంగా లాక్ డౌన్ కాలంలో తన అసలైన మంచి తనాన్ని చాటుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా వలసలు వచ్చిన కూలీలు సొంత ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడడంతో వందల కీలమీటర్లు నడవడానికి రోడ్డు బాట పెట్టారు. దీంతో వారికి సోనూ సూద్ అండగా నిలిచాడు. బస్సులను ఏర్పాటు చేసి తీరాలకు చేర్చాడు.

మునుపటి కంటే ఎక్కువ అభిమానం
మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా సొంత ఊళ్లకు రోడ్డు బాట పట్టిన పేదలను వారి స్వస్థలాలకు పంపేందుకు సోనూ సూద్ సొంత ఖర్చులతో వందలాది వోల్వో బస్సులను సిద్ధం చేశాడు. ఈ నటుడు చేసిన సహాయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇక రీసెంట్ గా ఆంద్రప్రదేశ్ లో ఒక పేద రైతుకు ట్రాక్టర్ కొనివ్వడంతో తెలుగు జనాలు కూడా అతనిని మునుపటి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారు. అయితే అతను చేసిన సహాయంపై కొన్ని రాజకీయ వాదనలు వినిపిస్తుండడం గమనార్హం.

సోనూ సూద్ పాలిటిక్స్?
సోనూ సూద్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రధాని మోడీని కలుసుకొని బీజేపీ కండువ కప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు నార్త్ మీడియాలో అప్పట్లోనే కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా సోనూ సూద్ డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా అతనికి అభినందనలు తెలుపడం అలాగే చంద్రబాబు రైతు ఇద్దరు కుతుళ్ళను చదివిస్తాను అని చెప్పడంతో పొలిటికల్ కామెంట్స్ ఎక్కువయ్యాయి.

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్
నిజంగా సోనూ సూద్ వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉందని సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి కామెంట్స్ రావడం వైరల్ గా మారింది. ఇక ఇటీవల ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో తనకు అలాంటి ఆలోచన ఏమి లేదని ప్రస్తుతం తన దృష్టి పేద వాళ్లకు వీలైనంత వరకు సహాయం చేయాలని ఉందని అన్నాడు.
Recommended Video

పదేళ్ల తరువాత ఆలోచిస్తా..
అలాగే పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడే తాను కచ్చితంగా చెప్పలేను అంటూ మరో పదేళ్ల తరువాత దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే ప్రస్తుతం తనకు టాలీవుడ్ బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో మంచి అవకశాలు వస్తున్నాయని అందుకే మరికొన్నాళ్ల పాటు మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇక సోనూ సూద్ మొత్తానికి రాజకీయాల్లోకి రాను అని కచ్చితంగా చెప్పలేడు. దీంతో అతని ప్రస్తావన ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











